టాలీవుడ్ లో రెండు సినిమాల్లో కాస్త లక్షణంగా కనబడినా తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమాలో హాట్ గా కనబడడమే కాదు... స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ సూట్ లో తడి తడి అందాలకు తెలుగు ప్రేక్షకులు పడిపోవడమే కాదు... మరోపక్క దర్శకనిర్మాతలు కూడా పూజ హెగ్డే కి పడిపోయారు. అందుకే ఏకంగా ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేసారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాలో కన్ఫర్మ్ అయిన పూజ ని ప్రభాస్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తీసుకోబోతున్నాడు. అలాగే మహేష్ బాబు తన 25 వ సినిమాలో హాట్ గర్ల్ పూజ హెగ్డే నే ఫైనల్ చేసుకున్నాడు.
మరి ఒక్కసారిగా లక్కున్న హీరోయిన్ గా మారిపోయిన పూజ కి ఇప్పుడు మరో అదృష్టం వరించింది. అదేమిటంటే హైద్రాబాద్ కి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా పూజ హెగ్డే పేరు మార్మోగిపోతోంది. రీసెంట్ గా టైమ్స్ గ్రూప్ వారు మోస్ట్ డిజైరబుల్ ఉమన్ ఎవరు అని నిర్వహించిన ఓటింగ్ లో... పూజ హెగ్డే కి తెలుగు ప్రేక్షకులు ఏకంగా అగ్రస్థానం కట్టబెట్టేసి టాప్ ప్లేస్ లో నిలబెట్టేశారు. మరి డీజే లో బికినీ వేడి ఎలా ఉందొ దీన్ని బట్టే స్పష్టమైంది. ఇక మోస్ట్ డిజైరబుల్ ఉమన్ లిస్ట్ లో పూజ హెగ్డే మొదటి స్థానంలో ఉండగా... కాజల్ అగర్వాల్ రెండవ స్థానం, రకుల్ ప్రీత్ మూడవ స్థానానికి పరిమితం అయ్యారు.
అలాగే ఆతర్వాతి స్థానాల్లో పీవీ సింధు 4 ప్లేస్, ఆదా శర్మ 5, తమన్నా 6, సిమ్రాన్ చౌదరి 7, శృతి వ్యాకరణం 8, అనుష్క శెట్టి 9, మిథాలీ రాజ్ 10వ స్థానాల్లో ఉన్నారు. మరి సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ ని పక్కకి నెట్టేసి ఇలా హైద్రాబాద్ కి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా పూజ హెగ్డే వచ్చింది అంటే ఆమెకి ఏ లెవల్లో క్రేజ్ ఉందొ చెప్పొచ్చు. ఏదైనా మడి కట్టుకుని కూర్చుంటే పనేం జరగదు. అంతా చూపిస్తేనే అవకాశాలు... అనడానికి ఇప్పుడు పూజ హెగ్డేనే పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.