ఇండస్ట్రీకి అడుగుపెట్టడమే భారీ డైరెక్టర్ తో భారీ ప్రాజెక్ట్ 'అఖిల్' తో దెబ్బతిన్న హీరో అఖిల్ అక్కినేని. ఆ సినిమా తర్వాత మళ్ళీ నాగార్జున ఎంతో ఘనంగా అఖిల్ రీ లాంచ్ ఫిలిం అంటూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమాని భారీగా నిర్మించినా... ఆ సినిమా కూడా అఖిల్ కి అనుకున్నంత హిట్ తేలేకపోయింది. హలో సినిమా టాక్ పరంగా హిట్ అయినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం ఫ్లాప్ గానే మిగిలింది. అయితే అఖిల్ తన మూడో సినిమాని మొదలు పెట్టడానికి చాలానే టైం తీసుకుంటున్నాడు. మధ్యలో కొరటాల, సుకుమార్ పేర్లు గట్టిగా వినబడినప్పటికీ తొలిప్రేమతో తోలి హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన మూడో ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ వార్త దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు కూడా.
మరి వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన తొలిప్రేమతో భారీ హిట్ అందుకున్న నిర్మాత భోగవల్లి ప్రసాద్ వెంకీ తదుపరి చిత్రాన్ని నిర్మించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ప్రస్తుతం యంగ్ హీరోలతో సినిమాలు చెయ్యడానికే మొగ్గు చూపుతున్నాడు భోగవల్లి. అందులో భాగంగానే వరుణ్ తేజ్ తో తొలిప్రేమ తీసిన భోగవల్లి ఇప్పుడు వెంకీ డైరెక్షన్ లో వచ్చే అఖిల్ సినిమాని కూడా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే అఖిల్ ని వెంకీ డైరెక్షన్ లో చెయ్యబోయే సినిమా కోసం అడగ్గా.. తన పారితోషికం 10 కోట్లు అని అఖిల్ చెప్పడంతో.. కంగారు పడ్డ భోగవల్లి ఆలోచనలో పడ్డాడట.
మరి అఖిల్ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా... యూత్ లో అఖిల్ కున్న క్రేజ్ కి అంత పెద్ద మొత్తం ఇచ్చినా ఇవ్వొచ్చని టాక్ వినబడుతుంది. మరి యూత్ తో సినిమాలు చేద్దామంటూ బయలుదేరిన భోగవల్లికి అఖిల్ చెప్పిన పారితోషికానికి షాకై ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది.