Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పై ఎందుకీ రూమర్లు!


యంగ్ టైగర్ అమెరికాలో పార్టీలో మందు తాగి.... జారిపడడంతో చిన్నగా గాయాలపాలై రెస్ట్ తీసుకుంటున్నాడు.... అని నిన్న సోమవారం సాయంత్రం నుండి కొన్ని వెబ్, యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలొస్తున్నాయి.  రాజమౌళి కోసం అమెరికా వెళ్లిన చరణ్, ఎన్టీఆర్ లు అక్కడ టెస్ట్ షూట్స్ కోసం ప్రిపేర్ అవుతూ పార్టీ చేసుకున్నట్లుగా... ఆ పార్టీలో ఎన్టీఆర్ మందు తాగి కిందపడగా. చరణ్ మాత్రం టెస్ట్ షూట్ చేయించుకుని... తిరిగొచ్చేయ్యగా... ఎన్టీఆర్ మాత్రం అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడని ఏవేవో వార్తలు హలచల్ చేశాయి. మరి ఇలాంటి గాసిప్స్ ని ఎందుకు ఎలా పుట్టిస్తారో.. గాని కొన్నిసార్లు అసలేం జరగని విషయాన్నీ కథనాలు కథనాలుగా ప్రచారం చేస్తూ సెలెబ్రిటీస్ ని ఆడుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ అమెరికాలో గాయపడ్డాడు అనే వార్త కేవలం పుకారు మాత్రమే... అని ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు తెలిపాడు. ఎన్టీఆర్ పై వస్తున్న వార్తలకు స్పందించిన కొందరు ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరుని కలవగా మహేష్.... ఎన్టీఆర్ కి ఏం కాలేదని.. ఆయన అమెరికాలో పని ముగించుకుని గత రాత్రే హైదరాబాద్ వచ్చేశాడని తెలిపాడు. మరి ఎన్టీఆర్ ఇక్కడ హైదరాబాద్ కి చేరుకోగానే... తాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోయే సినిమా కోసం వర్కౌట్స్ మొదలుపెట్టేశాడు. మరి ఎన్టీఆర్ హుషారుగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

మరి ఎన్టీఆర్ ఆ జిమ్ లుక్ ని బట్టే ఎన్టీఆర్ కి ఏ గాయాలు అవలేదని... స్పష్టంగా అర్ధమవుతుంది. మరి గాసిప్స్ పుట్టించొచ్చు గాని మరి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని, హాస్పిటల్ పాలయ్యారని ఇలాంటి గాసిప్స్ వలన ఆయా కుటుంబంలోని వ్యక్తులు ఎంతగా బాధపడతారో అనేది నాలుగు రోజుల క్రితం జరిగిన శ్రీకాంత్ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ.

Rumours about Young Tiger's injury:

Fact About NTR’s Injury In USA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs