Advertisement
Google Ads BL

మెగా జాతర పెరుగుతూనే ఉంది..!


నాడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కుటుంబాల సంగతేమో గానీ నేడున్న మెగాఫ్యామిలీ వారసులు, వారసురాళ్ల హవా మాత్రం సాగుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, నాగబాబు, అల్లుఅర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌, కొణిదెల నిహారికలతో పాటు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ కూడా హీరోగా మారుతున్నాడు. బహుశా ఒకే కుటుంబం నుంచి అత్యధిక నటీనటులు ఉన్న ఫ్యామిలీగా మెగా కుటుంబాన్ని గిన్నీస్ బుక్‌లోకి కూడా ఎక్కించే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక ఈ మెగాస్టార్‌ పేరుతో వస్తున్న వారు కూడా తమదైన ప్రతిభతో ఎంతో కొంత పేరు, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరందరూ ఎవరి పనుల్లో వారు బిజిగా ఉన్నా కూడా ఏదైనా ఫ్యామిలీ వేడుక జరిగితే ఒకే చోట వాలిపోయి నానా హంగామా చేస్తారు. 

Advertisement
CJ Advs

ఇక వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వాటిని చూసి మెగాభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇలా మెగా కుటుంబానికి చెందిన యువ వారసులందరూ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత బర్త్‌డే వేడుకల్లో కలిసి కనిపించారు. దీనికి సాయిధరమ్‌తేజ్‌, అల్లుఅర్జున్‌, ఆయన శ్రీమతి స్నేహారెడ్డి, నాగబాబు తనయురాలు, మెగా వారసురాలైన కొణిదెల నిహారిక, చిన్నకూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్‌ వంటి వారందరూ కలిసి ఈ వేడుకలో రచ్చ రచ్చ చేశారు. అందరు మెగా కూతురికి బర్త్‌డే విషెష్‌ చెప్పి గోల గోల చేశారు. సుస్మిత చేత కేక్‌ కట్‌ చేయించి, హడావుడి చేసి అందరు కలిసి ఓ సెల్ఫీ కూడా దిగారు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత ఈ మెగా వారసులందరూ ఇలా కలవడం ఈమధ్య కాలంలో ఇదే కావడంతో ఈ సెల్ఫీని మెగాభిమానులు ఎంతో ఎంజాయ్‌ చేస్తుండే సరికి ఇది వైరల్‌గా మారింది. 

Pic: Mega Family in One Place:

Mega Family Gropu Selfie Sensation in social media  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs