చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సాయి పల్లవి. మలయాళంలో కన్నా తెలుగులో చాలా పాపులర్ అయ్యి వరస సినిమాలు చేస్తూ వెళ్ళుతుంది. స్టార్ హీరోస్ తో నటించకుండానే ఆమెకి లక్షల్లో అభిమానులున్నారు. ఇక స్టార్ హీరోస్ పక్కన నటిస్తే అంతే సంగతులు. అయితే టాలీవుడ్ కి ఎంటర్ అయినప్పటి నుండి వార్తల్లో ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ.
కథ నచ్చకపోతే మొహం మీద నో అని చెప్పడమే కాకుండా.. తన పాత్ర నిడివి తగ్గిస్తే నిర్మాతని నిలదీస్తుంది. దీంతో సాయి పల్లవికి చాలా పొగరు ఉందని డిసిప్లిన్ లేదని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఎలాగైనా సాయి పల్లవికి ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి ఆమెకు అవకాశాలు రాకుండా చేయాలని ప్రయత్నిస్తుంది ఓ టీం.
లేటెస్ట్ గా అసలు ఏమాత్రం సంబంధం లేని యువ హీరోతో లింకులు పెట్టి ప్రచారం చేయడం కూడా స్టార్టయింది. ఇలా ఒక నటిపై ఈస్థాయిలో బురద జల్లుడు ఎప్పుడూ జరగలేదు. ఇదంతా కావాలనే చేస్తున్నారని సాయి పల్లవి ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే సాయి పల్లవి ఇవేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.