Advertisement
Google Ads BL

'రంగస్థలం'లో ఈ కుమార్ ఎవరు..?


ప్రస్తుతం ఇండస్ట్రీలో సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న 'రంగస్థలం' సినిమా ముచ్చట్లే. ఎందుకంటే గత నెలరోజులుగా ఒక్క మంచి సినిమా కూడా లేకుండా థియేటర్స్ అన్ని విలవిలాడుతున్నాయి. మరో 20  రోజుల వరకు ఇదే పరిస్థితి. అయితే మరో 20  రోజుల్లో రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీస్ వారి నిర్మాణంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.ఇక ఈ సినిమా రావడం కోసం అందరు ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఒక ఏడాది నుండి చెక్కుతున్న రంగస్థలం చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించింది.

Advertisement
CJ Advs

అయితే పల్లెటూరిలో జరిగే రాగ ద్వేషాలు, ప్రేమానురాగాలు, పంచాయితీలు ఇలాంటి వాటితో సినిమా ఉంటుందనే టాక్ ఉంది. అయితే రంగస్థలం సినిమా మొత్తం ఓ ఐదు పాత్రల చుట్టూతానే తిరుగుతుందని అంటున్నారు. ఎలా అంటే రామ్ చరణ్ అనగా చిట్టిబాబు, సమంత అనగా రామలక్ష్మి హీరోయిన్. వీరిద్దరి సినిమాకి మెయిన్ కీలకమైన హీరోహీరోయిన్స్. అయితే మరో ముగ్గురు కూడా ఈ సినిమాకి అత్యంత కీలకమంట. అందులో జగపతి బాబు ఒకరు. జగపతి బాబు ఈ సినిమాలో తనదైన విలనిజాన్ని పండించబోతున్నాడట. ఈ సినిమాలో జగపతి బాబు నటనకు అత్యధిక మార్కులు పడతాయంటున్నారు.

అలాగే మరో కీలక పాత్ర ఆది పినిశెట్టి చేయబోతున్నాడట. ఈ సినిమాలో చిట్టిబాబు కి అన్న.. కుమార్ గా ఆది పినిశెట్టి కనబడబోతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఆది రంగస్థలం లుక్ చూస్తుంటే అతను పొలిటికల్ గా ఎవరిమీదో తలబడబోతున్నాడనేది స్పష్టమైంది. ఇక మరో కీలకమైనపాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది. ఇప్పటివరకు వెండితెర మీద పెద్దగా స్కోప్ లేని పాత్రలు చేసిన అనసూయకు రంగస్థలం బిగ్ బ్రేక్ ఇస్తుందంటున్నారు. చూద్దాం ఇవన్నీ తెలియాలంటే ఈ నెల 30 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే రంగస్థలం మార్చి 30 న థియేటర్స్ లోకి రాబోతుంది.

Adhi First Look in Rangasthalam:

Adhi's First Look in Rangasthalam Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs