నితిన్ హీరోగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి కృష్ణ కార్తీక్ అనే లిరికిస్ట్ దర్శకుడిగా ఒక సినిమా తెరకెక్కుతోంది అనగానే ఆ సినిమాపై బీభత్సమైన అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే నితిన్ సినిమాని త్రివిక్రమ్ వంటి టాప్ డైరెక్టర్, పవన్ వంటి స్టార్ హీరో నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి కలగడమే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమాపై ఎంతో ఆసక్తి ఏర్పడింది. కానీ నితిన్ 'ఛల్ మోహన్ రంగ' టీజర్ విడుదలయ్యాక గాని అసలు విషయం బయటకి రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ 'ఛల్ మోహన్ రంగ' ని సమర్పించడం వరకే.. సినిమా నిర్మాణం మొత్తం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిదే అని.
కనీసంలో పావలా వాటా కూడా ఆ సినిమాకి వాళ్లిద్దరూ పెట్టడం లేదు. కేవలం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సమర్పిస్తున్నారంటేనే సినిమాకి క్రేజ్ వచ్చేస్తుందని... ఆ క్రేజ్ తోనే సినిమాపై అంచనాలు పెంచెయ్యొచ్చని నితిన్ బ్యాచ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ ఈ సినిమాకి స్టోరీ రైటర్ అన్నారు కానీ ఎక్కడా తెలుపలేదు. మరి నిర్మాతలుగా కాకుండా కేవలం పేర్లు వాడేసుకుంటేనే సినిమాకి క్రేజ్ వచ్చేస్తుందా... అలాగే త్రివిక్రమ్, పవన్ తో తమ సినిమాని ప్రమోట్ కూడా చేయించుకుందామనుకున్నారా... అంటే అది లేదు.
ఎందుకంటే త్రివిక్రమ్ - పవన్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా టైం లోనే అటు పవన్ కానీ, ఇటు త్రివిక్రమ్ కానీ ఎక్కడా ప్రచారం చెయ్యలేదు. మరి నితిన్ కోసం వచ్చి వాళ్ళు ప్రమోట్ చేసే తీరిక వారికీ లేదు. కేవలం పోస్టర్ లో పవన్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ పేరు కనబడితే చాలు సినిమాకి ఆటోమాటిక్ గా క్రేజ్ వచ్చిపడుద్ది అనుకున్నాడు నితిన్. కానీ 'ఛల్ మోహన్ రంగ' మీద పెద్దగా క్రేజ్ కనబడడం లేదు. మరి సినిమా ఆడియో వేడుకకు... లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కో పవన్ అయినా త్రివిక్రమ్ ని అయినా తీసుకొద్దామంటే... త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తర్వాత కనబడడం లేదు. ఇక పవన్ రాజకీయాలతో యమా బిజీ. ఈ లెక్కన కేవలం సినిమాపై క్రేజ్ కోసం పేర్లు ఏమేరకు పనికొస్తాయి అనేది మాత్రం అస్సలు అర్ధమే కావడం లేదు. పాపం నితిన్. ఏదో అనుకుంటే... ఇంకేదో అయ్యింది అన్నట్టుగా వుంది వ్యవహారం.