Advertisement
Google Ads BL

విరుష్కలు రెచ్చిపోతున్నారు.....!


పెళ్లి కాకముందే ఇప్పటి జనరేషన్‌ సెలబ్రిటీలు విపరీత పోకడలు పోతున్నారు. ఒకప్పుడు సోషల్‌ మీడియా లేదు కాబట్టి అలాంటివి జరిగినా ఎవ్వరికీ తెలిసే అవకాశం రాలేదు. కానీ ఇటీవల నాగచైతన్య-సమంతలు కూడా పెళ్లి కాకముందు నుంచే తమదైన శైలిలో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో విపరీతంగా పోస్ట్‌ చేసేవారు. ఎలాగూ కాబోయే భార్యాభర్తలే కదా.. ! అది వారి సరదా.. అని కొందరు భావిస్తే చేసేదేదో చేయకుండా దానిని గొప్పగా ఫీలవుతూ, సోషల్‌ మీడియాలో పెట్టడం ఏమిటని కొందరు ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎంతో సఖ్యతగా, తమ పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయకుండా ఇలాంటి ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది? అనేది కొందరి వాదన.

Advertisement
CJ Advs

ఇక ఆ తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు అనుష్కశర్మలు లేదు లేదంటూనే ఇటలీలో వివాహం జరుపుకున్నారు. దీనిని ముందుగానే మీడియా కనిపెట్టినా కూడా అనుష్కశర్మ మేనేజర్‌ మాత్రం చివరి నిమిషం వరకు ఇది కేవలం పుకారేనని తేల్చిచెప్పాడు. కానీ శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ నుంచి విరాట్‌ రెస్ట్‌ తీసుకోవడం, అనుష్కశర్మ కూడా షూటింగ్‌లకు గ్యాప్‌ తీసుకోవడంతో మీడియా ఊహించిందే జరిగింది. ఇక వీరు పెళ్లయిన తర్వాత ఓ దీవిలో హనీమూన్‌ జరపుకుని దక్షిణాఫ్రికాలో టెస్ట్‌ సిరీస్‌కి ఇద్దరు జోడీగా వెళ్లారు. ఆ తర్వాత వన్డేలు, టి20ల నాటికి అనుష్కశర్మ ఇండియా వచ్చి షూటింగ్‌లలో బిజీ అయింది. ఇక తాజాగా కూడా కోహ్లి శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్‌కి రెస్ట్‌ తీసుకున్నాడు. అనుష్క శర్మ కూడా 'జీరో, సూయిదాగా' చిత్రాలకు బ్రేక్‌ తీసుకుంది. వీరిద్దరు ప్రస్తుతం ముంబైలోని తమ ఫ్లాట్‌లో సంసార సుఖం అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. 

అలా ఉండటంలో తప్పేమి లేదు గానీ వారు పర్సనల్‌గా ముద్దుపెట్టుకుంటున్న ఫొటోల వంటివాటిని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయినా ఇది ఏమంత మంచి పద్దతి కాదని, ప్రేమను స్వీకరిస్తూ అనుభవించాలే గానీ దాని ద్వారా కూడా వార్తల్లో నిలవాలని, నాలుగు గోడల మద్య జరిగే తంతుని బహిర్గతం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. 

Virushka Romance in Public Place:

Virushka Romantics Contraversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs