Advertisement
Google Ads BL

షకీలా కూడా మార్పు కోరుకుంటోంది..!


నెల్లూరు జిల్లాకు చెందిన అమ్మాయే అయినా పొట్టకూటికోసం, తన కుటుంబం గడవడం కోసం కేరళ వెళ్లి అక్కడి అడల్ట్‌ చిత్రాలు, పెద్దలకు మాత్రమే అనే పోర్న్‌సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న సెక్సీబాంబ్‌ షకీలా. ఈమె చిత్రాలు నాడు విడుదల అవుతున్నాయంటే కేరళలోని స్టార్‌ హీరోలు కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకునేవారు. దాంతో సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి ఆమెని అనఫిషియల్‌గా కూడా బ్యాన్‌ చేశారు. తర్వాత ఆమె తెలుగులోకి వచ్చి పలు చిత్రాలలో క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తోంది. ఇక తాజాగా కేరళలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందుతూ, ఆమె ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఆమె 250వ చిత్రంగా 'శీలవతి'గా రిలీజ్‌ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌లో పనిలో పనిగా షకీలా రాజకీయాలను కూడా ప్రస్తావించారు. 

Advertisement
CJ Advs

ఇటీవల రాజకీయాలలోకి వచ్చి కొత్త పార్టీ పెట్టిన కమల్‌హాసన్‌ నన్ను పిలిచి ప్రచారం చేయమంటే సంతోషంగా అంగీకరిస్తాను. ప్రజలను విద్యావంతులుగా, చైతన్యవంతులుగా చేయాలని కమల్‌ తరుచుగా చెబుతూ ఉంటారు. ప్రజలలో చైతన్యం తేవడం, ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా దేశం బాగుంటుందని కమల్‌ చెబుతున్న మాటలకు నేను మద్దతు ఇస్తున్నాను. ప్రజలకు మంచి చేయాలనే కమల్‌ రాజకీయాలలోకి వచ్చారు. ఈ విషయం గమనించకుండా ఆయనను పలువురు విమర్శించడం తగదు.... అని చెప్పారు. మొత్తానికి ఇన్‌డైరెక్ట్‌గా తనకు కూడా రాజకీయాలలోకి రావాలనే ఆశ ఉందని షకీలా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఆమెకి నటిగా పెద్దగా క్రేజ్‌ లేదు. నాటి రోజుల్లో కనిపించినంత హాట్‌గా ఈ లేటు వయసులో చూపిస్తే కిక్‌ ఉండదు. మరోవైపు సన్నిలియోన్‌ నుంచి మియా వంటి పోర్న్‌స్టార్స్‌ దూసుకుని వచ్చేస్తున్నారు. అలాగని ఈమెకి ఏ పాత్రలంటే అవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే గిస్తే ఏదైనా వ్యాంపు తరహా పాత్రలనే ఇస్తారు తప్పితే ఇతర పాత్రలను ఇచ్చే అవకాశం లేదు. 

ఇక ఇటీవల ఆమె రాంగోపాల్‌ వర్మ జీఎస్టీ2 చేస్తానంటే నేను అందులో నటిస్తానని కూడా చెప్పింది. మొత్తానికి ఈ సెక్స్‌ బాంబ్‌ తన మనసులోని మాటను బయట పెట్టడం ద్వారా పలు పార్టీలకు రాజకీయంగా ఇన్‌డైరెక్ట్‌గా సందేశం పంపింది. ఇక ఈమె బయోపిక్‌ను త్వరలో తెరకెక్కించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరణించిన వారి బయోపిక్‌లంటే వారికి కొంత మొత్తం చెల్లించాల్సిన పని ఉండదు. కానీ షకీలా విషయంలో మాత్రం ఆమె అనుమతి తీసుకుని, ఆమెకంటూ రాయల్టీ చెల్లిస్తేనే ఈమె బయోపిక్‌ రూపొందే అవకాశం ఉంది. మరి అది నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది....! 

Shakeela Support's to Kamal Haasan:

Shakeela About Kamal Haasan Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs