Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ విలనా..?


పెళ్లి చూపులు మర్చిపోయి... అందరూ అర్జున్ రెడ్డితో మాత్రమే విజయ్ కి ఒక బిగ్ క్రేజ్ కట్టబెట్టేశారు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా చేసినా...ప్రేమ కోసం బాధ్యతలేని కుర్రాడిగా మారి పక్కా తాగుబోతులా డాక్టర్ గిరిని కూడా పోగొట్టుకున్న కుర్రాడిలా యూత్ కి తెగ నచ్చేశాడు. మరి అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నెగెటివ్ అంటే నెగెటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్ కేరెక్టర్ లో అదరగొట్టేశాడు. ఆ సినిమా తర్వాత విజయ్ కి చేతి నిండా సినిమాలే. ప్రస్తుతం విజయ్ ట్యాక్సీవాలా  విడుదలకు సిద్ధమవుతుండగా... పరశురాం దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా విజయ్ దేవరకొండ ఒక తమిళ సినిమాని ఒకే చెయ్యడమే కాదు.. అప్పుడే పూజ కార్యక్రమాలతో మొదలెట్టేశాడు కూడా. తమిళంలో ఇరిమ నంబి ఫెమ్ ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ 'నోటా' అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్నాడు. అయితే ఈ తమిళ డెబ్యూ నేతల్లో విజయ్ దేవరకొండ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 'నోటా' ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని.... సస్పెన్స్ మైంటైన్ చేస్తూ ఊహించని మలుపులతో కథను ఆనంద్ మలిచాడని తెలుస్తోంది.

అసలు ఈ సినిమాలో విజయ్ కేరెక్టర్ కి నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒప్పుకోవడానికి కారణం మాత్రం. గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏ సినిమాలోనూ లేని ప్రత్యేకత ఈ 'నోటా' సినిమాలో ఉండటమేనట. అయితే విజయ్ కేరెక్టర్ మొదట్లో నెగటివ్ గా అనిపించినా దాని వెనుక సహేతుక కారణం ఉంటుందని ఎన్నికల వ్యవస్థను మార్చడానికి నడుం బిగించిన ఒక యువకుడి కథగా 'నోటా' సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో.. విజయ్ తమిళ డెబ్యూతోనే నెగటివ్ షేడ్స్ లో అలరించబోతున్నాడన్న మాట.

Young actor turns villain:

Vijay to face a never before villain for the first time in career? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs