ఈమెకి రాధికా ఆప్టేనే ఆదర్శమా..!


మన సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా నటీమణులు స్వేచ్చ అనే పదానికి విపరీతార్ధాలు తీస్తున్నారు. బికినిలు, ఇష్టం వచ్చినట్లు ఎక్స్‌పోజింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడుతూనే మరోవైపు తమని ఎవరైనా విమర్శిస్తే మా ఒళ్లు, మా ఇష్టం ఆమాత్రం మాకు స్వేచ్చ లేదా? అంటూ విపరీత పోకడలు పోతున్నారు. నిజానికి సినిమా వారి ప్రభావం ప్రేక్షకులపై విపరీతంగా ఉంటుంది. వీరు మహిళా స్వేచ్చ ముసుగులో ఇలాంటివి చేస్తున్నారు. ఇక మన మహిళా సంఘాలు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోరు. బయటి ప్రపంచంలో యువతులు పలువురు ఈ సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకుని వారు వేసిన వేషాలే వేస్తూ దానికి స్వేచ్చ.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని నీతులు చెబుతున్నారు. 

ఇక సినిమాలలో హోమ్లీగా, మన పక్కింటి అమ్మాయిలా ఉండే రాధికా ఆప్టే రీల్‌లైఫ్‌లో అలా ఉన్నా కూడా రియల్‌లైఫ్‌లో మాత్రం బికినీలు, గ్లామర్‌షో, క్లీవేజ్‌ షోలతో కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే 'ప్యాడ్‌మెన్‌' అనే చిత్రంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అమాయకురాలైన రోల్‌ చేసి మెప్పించింది. శానిటరీ నాప్‌కిన్స్‌ వాడటం అంటే భయపడిపోయే పల్లెటూరి భార్య పాత్రలో జీవించింది. అలా నిండుగా కనిపించి, ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపిన రాధికా ఆప్టే ఒక్కసారిగా మరలా బికీనీలతో సోషల్‌ మీడియాలోకి రావడం మన ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి విమర్శలు వస్తాయని నాకు తెలుసు. బట్‌ ఐ డోంట్‌ కేర్‌.. నాకు నచ్చినట్లు నేనుంటానని చెప్పింది. ఇప్పుడు తాజాగా బుల్లితెర నటి రుబినా దలాయక్‌ బికినీ ఫొటోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చీప్‌గర్ల్‌, సిగ్గు లేదా అని కామెంట్‌ చేస్తున్నారు. అయినా ఆమె ఇలాంటి ఫొటోనే మరోటి షేర్‌ చేసి ఈ కామెంట్లకు నేను భయపడను అని సమాధానం చెప్పింది.

'శక్తి అస్విస్థ కే ఎహ్‌సాస్‌కీ' సీరియల్‌ ద్వారా ఈమె పాపులర్‌. ఇందులో ట్రాన్స్‌జెండర్‌ పాత్రని చేసి ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. తరచు ఇలాంటి ఫొటోల ద్వారా వార్తల్లో ఉండే ఆమె బికినీ ధరించి హాట్‌ హాట్‌ ఫొటోలకి ఫోజులివ్వగా, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అభినవ్‌ శుక్లా తీసిన ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై వచ్చిన విమర్శలకు ఆమె సమాధానం ఇస్తూ, 'నా శరీరంతో.. నేను ఎంతో సౌకర్యవంతంగా.. ఆనందంగా ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు. ధన్యవాదాలు' అని అంటూ మనిషికి వ్యక్తిగత స్వేచ్చ ఎంతో అవసరం అని తన జ్ఞానాన్ని, తెలివిని ప్రదర్శించింది.

This Hot Bikini picture of Rubina Dilak has become the talk of the town!:

Rubina Dilaik sizzles in yet another bikini shoot with beau Abhinav Shukla
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES