Advertisement
Google Ads BL

ఆ హీరో సరసన ప్రియా వారియర్ అంట!


ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందరి కళ్ళలోనూ పడడమే కాదు... ఒక్కసారిగా సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకుని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుని స్టార్ హీరోల చూపు తన మీద పడేలా చేసుకుని.. అదృష్టం అంటే ఇది అని చూపించిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ పై నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రియా ప్రకాష్ నటిస్తున్న ఒరు అదార్ లవ్ ఇంకా  ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ అమ్మాయి ఎంతగా పాపులర్ అయ్యింది అంటే... టాలీవుడ్ నుండి ప్రియకు అవకాశాల వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కేవలం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదండోయ్... ఏకంగా అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి.

Advertisement
CJ Advs

అది కూడా బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ సింగ్ పక్కన ఒక బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా చెబుతున్నారు. టాలీవుడ్ టెంపర్ ని బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముందు రణ్వీర్ కి జోడిగా అలియా భట్ దగ్గర నుంచి సారా అలీ ఖాన్ పేర్ల వరకు వినిపించినా ఇప్పుడు మాత్రం కన్ను కొడుతూ కవ్విస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కి రణ్వీర్ పక్కన అవకాశం వచ్చినట్లుగా ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఎప్పుడో సింబా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రోహిత్ శెట్టి ఇప్పటివరకు రణ్వీర్ కి హీరోయిన్ ని సెట్ చెయ్యలేకపోయాడు.

మరి ఇప్పటికైనా రణ్వీర్ కి హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ ని ఫైనల్ చేస్తారో లేదంటే.... మరో భామని వెతుకుతారో గాని ప్రస్తుతం మాత్రం ప్రియా పేరుని రణ్వీర్ కి తగిలించి చేస్తున్న ప్రచారం మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ కి కలిసొచ్చే అంశంగానే కనబడుతుంది.

Priya Warrier to act in Bollywood with Ranveer Singh:

Priya Prakash Warrior Will Debut With Ranveer Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs