Advertisement
Google Ads BL

మోహన్ బాబు మనవరాళ్లు.. బాలయ్య డైలాగ్!


 

Advertisement
CJ Advs

తెలుగులో బెస్ట్‌ డైలాగ్‌ డిక్షన్‌ అంటే పాతతరంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీరంగారావు, జగ్గయ్య వంటి వారి తర్వాత మోహన్‌బాబు పేరును చెప్పుకోవాలి. ఆయన నటునిగా ఎదిగేందుకు ఆయన డైలాగ్‌ డిక్షనే ప్రధాన కారణమని చెప్పాలి. కానీ ఆయనకు వచ్చిన డైలాగ్స్‌లోని ప్రతిభ, డైలాగ్స్‌ని చెప్పే విధానం వంటివి ఆయన ముగ్గురు పిల్లలకు కూడా రాలేదు. ఈయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు ఏదైనా డైలాగ్‌ చెబితే, అది సీరియస్‌ డైలాగ్‌ అయినా కూడా మనకి కామెడీగా అనిపిస్తుంది. ఇక ఆయన కూతురు మంచు లక్ష్మి అయితే తెలుగును ఖండ ఖండాలుగా నరికి తనదైన స్టైల్‌లో తెంగ్లీష్‌ భాష మాట్లాడుతుంది. 

ఇక విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో బాలకృష్ణ చెప్పే ఓ డైలాగ్‌ ఎంతో పాపులర్‌ అయింది. సినిమా డిజాస్టర్‌గా నిలిచినా కూడా బాలయ్య డైలాగ్‌ మాత్రం బాగా పేలింది. బహుశా ఆ చిత్రం గురించి చెప్పుకోవాలంటే ఆ ఒక్క డైలాగ్‌ తప్ప ఇక అందులో ఏమి లేదు. ఆ డైలాగే 'సో...డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌..ట్రబుల్‌ ట్రబుల్స్‌ యూ, ఐయామ్‌ నాట్‌ ది ట్రబుల్‌, ఐయామ్‌ ది ట్రూత్‌' అంటూ గుక్కతిప్పుకోకుండా బాలయ్య చెయ్యి ఊపుతూ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ అనేక చోట్ల వినిపిస్తూ ఉంది. తాజాగా ఈ డైలాగ్‌ని మంచు విష్ణు కూతుర్లయిన అరియానా, విరియానాలు తండ్రి ఒడిలో కూర్చుని డబ్‌ష్మాష్‌ చేశారు. 

తన ఒడిలో కూర్చుని తన పిల్లలు చెబుతున్న డైలాగ్‌ని చూసి మంచు విష్ణు కూడా ఆశ్చర్యపోయాడు. ఇలా తండ్రి వారసత్వం ఆయన కుమారులు, కుమార్తెలకు రాకపోయినా ఆయన మనవరాళ్లకి రావడం సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది....! 

Ariyana Viviana imitates Balayya:

Mohan Babu Granddaughters imitates Balakrishna  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs