టాలీవుడ్ ద్రుష్టి మొత్తం ఇప్పుడు రాజమౌళి తీసే మల్టీ స్టార్రర్ పైనే వుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ అంటే ఆ మాత్రం క్రేజ్ అండ్ బజ్ వుంటది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అంత.
ఈ సినిమా వీరి పాత్రలు ఎలా వుంటాయో అని అందరిలోనూ ఆత్రుత వుంది. అయితే సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అన్నయ్యగా.. రామ్ చరణ్ తమ్ముడుగా కనిపించి మనల్ని అలరించబోతున్నారని ఫిలిం నగర్ టాక్.
ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండే ఈ సినిమా ఆ జోనర్ కు సంబంధించింది..ఈ జోనర్ కు సంబంధించింది అని చాలా టాక్స్ వచ్చాయి. అయితే లేటెస్ట్ రూమర్ ప్రకారం ఇది ఒక యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి.