Advertisement
Google Ads BL

అనసూయ మళ్లీ వస్తోందట..!


అందం కంటే గ్లామర్‌షో, మాటల నేర్పుతో బుల్లితెర, వెండితెర మీద కూడా బాగా పాపులర్‌ అవుతున్న నటి అనసూయ. ఇద్దరు పిల్లలున్న ఈ ఆంటీని చూస్తే అలా అనిపించదు. ఇక ఈమె ఇటీవల ఓ బాలుడి సెల్‌ఫోన్‌ని తీసుకుని నేలకేసి కొట్టడంతో ఈమెపై నెటిజన్లు పబ్లిక్‌లో ఎలా బిహేవ్‌ చేయాలో నేర్చుకోమని గట్టిగానే క్లాస్‌లు పీకారు. దాంతో ఈమె ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి మాధ్యమాల నుంచి డీయాక్టివేట్‌ అయింది. ఇక ఈమె నటిస్తున్న రామ్‌చరణ్‌-సుకుమార్‌ల 'రంగస్థలం1985' చిత్రం మార్చి 30న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె మరలా సోషల్‌మీడియాలోకి వస్తానని చెప్పింది. 

Advertisement
CJ Advs

ఓ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, నా కుటుంబ సభ్యుల కోసమే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నాను. బాలుడి ఉదంతంలో ఓ వర్గం మీడియా నన్ను టార్గెట్‌ చేసింది. నాకు వ్యతిరేకంగా పనిచేసింది. నాకు ఎన్నో బాధలు ఉన్నా నాపై కథనాలు రాయడం నన్ను బాధించింది. ఇంకొందరైతే నా గురించి ఏమీ తెలియకపోయినా నాపై నెగటివ్‌ కామెంట్స్‌ చేశారు. అసభ్యమైన కామెంట్స్‌ రావడంతోనే సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. నేను ధైర్యవంతురాలినే. ఇలాంటి కామెంట్స్‌కి వెనకడుగు వేసే మనస్తత్వం నాది కాదు. దానివల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం తట్టుకోలేకపోయాను. నా కొడుకులు పెద్దవారవుతున్నారు. తల్లిదండ్రుల వయసు కూడా పెరుగుతోంది. నాకున్న ఓపిక వారికి ఉండకపోవచ్చు. 'రంగస్థలం' తర్వాత మరలా సోషల్‌మీడియాలోకి వస్తానని ఈ లేడీ వర్మ అంటోంది. 

మహిళలు ఎంతో ప్రేమని ఇస్తారు. వారికి అంతకు మించిన ప్రేమని ఇవ్వాలి. నా ఎదుగుదల వెనుక మా నాన్న, భర్తల ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపింది. అంతా బాగానే ఉంది కానీ నాగురించి తెలియకుండా ఏవేవో అన్నారని అంటోంది. ఆమె గురించి తెలుసుకోవడానికి ఆమెమైనా ఝాన్సీలక్ష్మీభాయ్‌ లేదా మదర్‌థెరిస్సానా? ఇక నా పిల్లలు పెద్దవారవుతున్నారని తనే చెబుతోంది. కాబట్టి పెరిగిన పిల్లల ఎదుట అయినా వారు తలదించుకునే పనులు చేయకుండా, వారు గర్వంగా చెప్పుకునేలా మాటలు, వస్త్రధారణలలో హుందాగా ఉండటం మంచిదని ఆమె గుర్తించాలి. 

TV Anchor Anasuya Back On Social Media:

Anasuya Bharadwaj ready to make her come back to social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs