Advertisement
Google Ads BL

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు..!


మెగాఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది వారసులు ఉన్నారు. ఇక నందమూరి, అక్కినేని, మంచు, రామానాయుడు వంటి ఫ్యామిలీల నుంచి కూడా వారసులు బాగానే వస్తున్నారు. ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పిల్లలైన రమేష్‌బాబు, మహేష్‌బాబు, మంజుల వంటి వారు నటులయ్యారు. ఇక సుధీర్‌బాబు కూడా హీరోగా చేస్తున్నాడు. మంజుల కుమార్తె జాన్వి 'మనసుకు నచ్చింది'లో కనిపించింది. మహేష్‌బాబు కుమారుడు గౌతమ్‌ కృష్ణ '1' (నేనొక్కడినే) చిత్రంలో బాలనటునిగా కనిపించాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ నటనకు సంబంధించిన అన్ని విషయాలలో శిక్షణ తీసుకుని త్వరలో ఘట్టమనేని వారసునిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మహేష్‌ బావ కొడుకు అంటే మహేష్‌ మేనల్లుడు, కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇతను నటనకు సంబంధించిన విషయాలలో ఇప్పటికే అమెరికాలో శిక్షణ తీసుకున్నాడు. 

తాజాగా గల్లా జయదేవ్‌ తన కుమారుడు అశోక్‌ గల్లాని తెలుగుదేశం ఆఫీసుకి తీసుకు వచ్చాడు. అక్కడ మురళీమోహన్‌తో పాటు పలువురు టిడిపి నాయకులు గల్లా అశోక్‌ని ఆప్యాయంగా పలకరించారు. అశోక్‌ గల్లా అభిరుచిని గూర్చి గల్లా జయదేవ్‌ని అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు సినీ రంగంలోకి వెళ్లి హీరోగా పరిచయం అవుతాడని గల్లా జయదేవ్‌ తన తోటి నాయకులు, ఎంపీలకు చెప్పారు. దాంతో గల్లా అశోక్‌ కోరిక నెరవేరాలని పలువురు ఆయనకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. 

ఇక గల్లా అశోక్‌ దిల్‌రాజు నిర్మాతగా, ఆయన బేనర్‌ నుంచే హీరోగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రానికి రాజమౌళి వద్ద పనిచేసిన ఆర్‌.కె. అనే  అసోసియేట్‌ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే జయకృష్ణ, అశోక్‌గల్లాల తెరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. 

Mahesh Babu's nephew Ashok Galla to debut as an actor soon:

Another Hero From GhattamaNeni Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs