స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారమెత్తబోతున్నాడు. తన నటనతో... స్టైలిష్ లుక్స్ తో బన్నీ ఎటువంటి క్రేజ్ సంపాందించుకున్నాడో మన అందరికి తెలుసు. ఇప్పుడు ఈ హీరో కన్ను సినీ నిర్మాణంపై పడినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ తాజాగా క్రిష్ (జాగర్గమూడి రాధాకృష్ణ)తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ తన నెక్స్ట్ మూవీ కోసం ఫిలిం ఛాంబర్ లో 'అహం బ్రహ్మాస్మి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ ప్రాజెక్ట్ కు తనతో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించేందుకు అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.
ఈ ప్రాజెక్ట్ కు సగం నేను ఇన్వెస్ట్ చేస్తానని.. వచ్చిన ప్రాఫిట్స్ లో సగం సగం పంచుకుందాం అని అల్లు అర్జున్.. క్రిష్ కి చెప్పినట్లు సమాచారం. అయితే డైరెక్టర్ క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను తన తండ్రితో కలిసి నిర్మించాలనుకుంటున్నాడని మరో వార్త వినబడుతోంది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో కంగనా హీరోయిన్ గా మణికర్ణిక సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటుగా ఈ అహంబ్రహ్మస్మి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సహ నిర్మాత ఎవరనే సస్పెన్స్‌కు తెరపడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.