Advertisement
Google Ads BL

సురభికి అప్పుడే ఇటువంటి ఆలోచనలెందుకు?


మెయిన్ హీరోయిన్ గా చేసి సెకండ్ హీరోయిన్ గా చేయాలంటే చాల మంది వెనక్కి తగ్గుతారు. సెకండ్ హీరోయిన్ పాత్రలు మెయిన్ హీరోయిన్ గా పాత్ర ఒకే కానీ మెయిన్ లీడ్ గా సినిమాలు చేసుకుంటూ సెకండ్ హీరోయిన్ గా చేయాలంటేనే కష్టం. 

Advertisement
CJ Advs

కానీ టాలీవుడ్ లో ఓ హీరోయిన్ కు ఇటువంటి ఆఫరే వచ్చింది. ఆమే సురభి. బీరువా అనే సినిమాతో టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చి ఎక్స్ ప్రెస్ రాజాతో మంచి హిట్ అందుకుని 'ఒక్క క్షణం'తో మనల్నిపలకరించింది ఈ ఢిల్లీ చిన్నది. చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నాసరే నటనలో పెద్ద ఎత్తి చూపేంతటి తప్పులేం చేయట్లేదు.

కానీ ఇప్పుడు ఈ అమ్మడుకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నాయట. దిల్ రాజు నిర్మాణంలో నితిన్ - రాశి జంటగా శ్రీనివాస కల్యాణంలో రెండో హీరోయినుగా అవకాశం వస్తే నేను హీరోయిన్ గా మాత్రమే చేస్తాను అని ఆ అవకాశాన్ని పక్కకు తోసేసింది. అలానే రామ్ - అనుపమ నటిస్తున్న 'హలో గురు ప్రేమ కోసమే' అనే సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వస్తే అది కూడా చేయను అని తెగేసి చెప్పేసింది. ఆమె ఆలోచనలో కొంత నిజం వుంది కానీ... ఎన్నాళ్ళని హీరోయిన్ పాత్రే కావాలని ఎదురు చూస్తూ కూర్చుంటుంది? వచ్చిన ఆఫర్స్ ని వదలకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నారు సినీ పండితులు. చూద్దాం ఎప్పటి వరకు ఈ అమ్మడు ఇలా మెయిన్ హీరోయిన్ గా చేస్తుందో.

Surabhi Refuse for Second Heroine Chances:

Heroine Surabhi Shocking decesion on Second heroine Roles  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs