కెరీర్ మొదట్లో మంచి విజయాలు సాధించి ఎనర్జిటిక్ స్టార్‌గా, డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌లో తనదంటూ ప్రత్యేక శైలిని రామ్ సాధించాడు. తన పెదనాన్న ఎంతో సీనియర్ నిర్మాత, అభిరుచి ఉన్న హిట్ చిత్రాల నిర్మాత అయిన 'స్రవంతి' రవికిషోర్ అయినప్పటికీ రామ్ వరుసగా పరాజయాలు మూటగట్టుకుంటూ వస్తున్నాడు. ఇక ఈయనకు మరలా కిషోర్ తిరుమల శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'నేను...శైలజ' మంచి హిట్‌ని అందించింది. కానీ 'హైపర్'తో పాటు మరోసారి కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలోనే ఫీల్‌గుడ్ మూవీగా 'ఉన్నది ఒకటే జిందగీ' చేశాడు. ఈ చిత్రం మంచి టాక్, క్లాస్ ఆడియన్స్ ఆదరణ, పాజిటివ్ రివ్యూలను అందుకున్నా కూడా స్లో నెరేషన్, కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మంచి సినిమాగా పేరు తెచ్చుకుని, కమర్షియల్‌గా మాత్రం ఫ్లాప్ ముద్రను వేసుకుంది.
ఇలాంటి సమయంలో రామ్‌కి ఆపద్బాంధవుడిగా దిల్‌రాజు కనిపించాడు. ఆయన రామ్ హీరోగా 'సినిమా చూపిస్త మావా, నేనులోకల్' చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరోసారి అనుపమ పరమేశ్వరన్‌తో కలసి చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా త్రినాథరావు నక్కిన హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశాడు. ఇక ఈ చిత్రం కూడా మామా అల్లుళ్ల జోనర్‌లోనే తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి టైటిల్‌ని కూడా ఎనౌన్స్ చేశారు. గతంలో అక్కినేని అఖిల్ 'హలో'కి బదులుగా పెట్టాలని భావించిన 'హలో గురు ప్రేమకోసమే'ని పెట్టారు. టైటిల్ మొత్తానికి అదిరిందనే చెప్పాలి. ఇక 'హలో, హలో గురూ' వంటి చిత్రాలు గతంలో బాగా ఆడలేదు. 'హలో బ్రదర్' బాగా ఆడింది. అదే తరహాలో ఈ చిత్రం టైటిల్ సెంటిమెంట్ పరంగా కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ చిత్రానికి కూడా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్, అనపమ పరమేశ్వరన్‌లతో పాటు ప్రకాష్‌రాజ్ కీలకపాత్రలో రామ్‌కి మామగా నటించనున్నాడని సమాచారం. ఇలా అందరూ అచ్చొచ్చిన వారే కావడంతో ఈ చిత్రం ద్వారా దిల్‌రాజు తాను హిట్ కొట్టి రామ్ కెరీర్‌ని కూడా ట్రాక్‌లో పెడతాడని ఆశించవచ్చు.