Advertisement
Google Ads BL

యమదొంగ పోరి మరలా వస్తోంది!


మమతా మోహన్‌దాస్‌.. ఈమె నిన్నటి చిత్ర ప్రియులకు బాగా ఇష్టం. స్వతహాగా మంచి సింగర్‌ అయిన ఈమె మంచి టాలెంట్‌ ఉన్న నటి కూడా. ఈమె తెలుగులో ఎన్టీఆర్‌ సరసన 'యమదొంగ', వెంకటేష్‌ 'చింతకాయల రవి', నాగార్జున 'కేడీ' వంటి చిత్రాలలో నటించింది. ఇక పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది. కానీ ఆమె ఉన్నట్లుండి సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లింది. దానికి కారణం ఆమెని మహమ్మారి క్యాన్సర్‌ చుట్టుముట్టేయడమే. అదే ఆమెని క్యాన్సర్‌ కబళించకపోయి ఉంటే ఆమె ఎంతో ఎత్తుకు ఎదిగేది. అయినా ఆమె భయపడలేదు. మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చింది. ట్రీట్‌మెంట్‌తో పాటు తన ఆత్మస్థైర్యంతో క్యాన్సర్‌ని జయించింది. 

Advertisement
CJ Advs

ఇటీవల కాలంలో సౌత్‌లో ఇలా క్యాన్సర్‌ని జయించింది ఇద్దరే, అందులో ఒకరు గౌతమి కాగా రెండో సినీ వ్యక్తి మమతా మోహన్‌దాసే. ఇక ఈమె అడపా దడపా మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమె దాదాపు పదేళ్లు అంటే దశాబ్దం తర్వాత మరలా కోలీవుడ్‌లో నటిస్తోంది. కోలీవుడ్‌లో ఆమెకి బాగా అభిమానులు ఉన్నారు. ఇక తమిళంలో నటిస్తే ఎక్కువ శాతం చిత్రాలు తెలుగులోకి కూడా డబ్‌ అవుతాయి కాబట్టి ఆమెని మరలా చూసే అవకాశం మన ప్రేక్షకులకు కూడా దక్కుతుంది. ఇక ఈమె ప్రస్తుతం ప్రభుదేవా సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తాజాగా ఊటీలో నిరాడంబరంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. 

ఈ చిత్రం టైటిల్‌ 'ఉమై విళిగల్‌'. ఇక ఈమె ఇదే సమయంలో మరో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నటి సీత మాజీ భర్త దర్శకుడు, నటుడు అయిన పార్తీబన్‌ చిత్రంలో ఈమె నటిస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ 'ఉళై వెలియా 2'. మరి ఈ రెండు చిత్రాలతో ఆమె మరలా పూర్వ వైభవం సాధిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Mamta Mohandas Back To Screen After A Long Gap:

Mamta Mohandas Makes A Comeback After Seven Years  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs