Advertisement
Google Ads BL

అలిగితే ఎవరికి నష్టం అనసూయ..?


పెద్దలు చెరువు మీద అలిగి.. అనే ఓ మోటు సామెతను చెబుతారు. ఇప్పుడు యాంకర్‌, హోస్ట్‌ అనసూయ వ్యవహారశైలి అదేవిధంగా ఉంది. ఆమె ఆ మధ్య ఓ బాలుడు సెల్ఫీ దిగాలని ఆశపడితే, చిన్నపిల్లాడు కాబట్టి వాడి కోరిక తీర్చడమో..లేదా ఇప్పుడు కాదు అని చెప్పకుండా ఏకంగా మొబైల్‌ ఫోన్‌ని నేలకేసి కొట్టి పగుల గొట్టింది. దాంతో ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకు పడ్డారు. దాంతో కోపం వల్లనో, నెటిజన్ల ముందు తలెత్తుకోలేకపోవడం వల్లనో ఆమె సోషల్‌ మీడియా నుంచి బయటికి వచ్చేసింది. ఇక హోస్ట్‌గానే కాకుండా రాబోయే రామ్‌చరణ్‌ 'రంగస్థలం 1985'లో మంగమ్మత్తగా నటిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక కొందరు మాత్రం సోషల్‌ మీడియా నుంచి బయటికి రావడం నీకే చేటు చేస్తుంది. వార్తల్లో లేక ఫ్యాన్‌ బేస్‌ పోయి నిన్ను మరిచిపోతారని సూచించినా కూడా మరలా ఇప్పుడప్పుడే సోషల్‌ మీడియాలోకి వచ్చే చాన్సే లేదని అనసూయ భరద్వాజ్‌ మొండిగా సమాధానం ఇస్తోందట. దాంతో ఆమెకి సలహా ఇచ్చిన శ్రేయోభిలాషులు, సన్నిహితులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోతున్నారని సమాచారం. ఇక ఈమధ్య వరకు అనసూయ భరద్వాజ్‌ తన వార్తలు, తన షోలు, సినిమాలలోని పాత్రలు, వాటి అప్‌డేట్స్‌ ద్వారా తన ఫాలోయర్స్‌కి ఎంతో దగ్గరిగా ఉంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా, బాగా చలాకీగా ఉండేది. సినిమా ఫీల్డ్‌లో సెలబ్రిటీలకు ఇలాంటి వివాదాలు సాధారణం. 

దీనిపై వివరణ ఇచ్చి తన తప్పులేదని నిరూపించడం, లేదా మౌనంగా ఉంటూ ఇలాంటివి కామనే అన్నట్లుగా ఉండాల్సింది పోయి అనసూయ బెట్టు చూస్తుంటే ఆమెకే ఈ విషయం తీవ్ర నష్టం చేకూర్చడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ఆమె తన అప్‌డేట్స్‌, హాట్‌ ఫొటోల ద్వారానే బాగా పాపులర్‌ అయిన విషయం ఆమెకి గుర్తుండే ఉంటుంది. 

Anchor Anasuya Quits Social Media:

Anchor Anasuya Deactivates her all Social Media Accounts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs