Advertisement
Google Ads BL

కోతలు మొదలుపెట్టిన అల్లుఅర్జున్‌!


కెరీర్‌ మొదట్లో అల్లుఅర్జున్‌ సినిమాల కథల నుంచి ఫైనల్‌ అవుట్‌పుట్‌, దర్శకుల వరకు అన్ని అరవింద్‌, చిరుల కనుసన్నల్లో జరిగేవి. కానీ ఇప్పుడు తనకు కూడా బాగా అనుభవం రావడంతో తన చిత్రాల విషయంలో బన్నీనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రామ్‌చరణ్‌లా అన్ని విషయాలలో మెగాస్టార్‌, మెగా కాంపౌండ్‌ మీద ఆధారపడకుండా సాగుతున్నాడు. దీనిని ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదా ఇంటర్‌ఫియరెన్స్‌ అని ఏదైనా పిలవచ్చు. అందునా బన్నీ ఓ స్టార్‌ కనుక తన ప్రాజెక్ట్‌ అవుట్‌పుట్‌ మరింత బాగా రావాలని ఆశించడంలో తప్పులేదు. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం ఆయన రచయిత అయిన వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రంలో నటిస్తున్నాడు. మే 4న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ కూడా దాదాపు పూర్తయింది. విడుదలకు ఓ పది రోజుల ముందరే అన్ని ఫినిష్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో బన్నీ రొటీన్‌ మాస్‌ హీరోగా కాకుండా తన బిరుదుకు తగ్గట్లు క్లాస్‌యాక్షన్‌ థ్రిల్లర్‌తో రానున్నాడు. నర నరాల్లో దేశభక్తి నింపుకుని సైన్యంలో విదేశీ సైన్యాన్ని ఇంటి దొంగల పని పట్టే పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఇలా ఈ చిత్రం దాదాపు సీరియస్‌ మూడ్‌లో సాగే సమయంలో ఫస్ట్‌హాఫ్‌లో బన్నీ, అను ఇమ్మాన్యుయేల్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ సీన్స్‌ నిడివి చాలా ఎక్కువైందని, సినిమా డీవియేట్‌ కాకుండా ఉండాలంటే వాటికి ఎడిటింగ్‌లో కత్తెర వేయమని బన్నీ వంశీకి సూచించాడట. 

వంశీ కూడా ఆ పనిని ఎడిటర్‌కి చెప్పేశాడని తెలుస్తోంది. ఫైనల్‌ రష్‌ తర్వాత గంటా 15 నిమిషాల ఫస్ట్‌హాప్‌ని దాదాపు 12 నిమిషాల కోత కూడా విధించారని సమాచారం. ఈ చిత్రంలో తనకి ఎక్కువ సీన్స్‌ ఉన్నాయని హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ ఎంతో ఆనందంగా ఉంది. అసలే 'అజ్ఞాతవాసి' ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోని అనుకి ఇది మూలిగే నక్కపై తాటి పండు పడినట్లేనని చెప్పాలి. 

Allu Arjun Editing For Na Peru Surya:

Allu Arjun Trims Romantic Scenes from Naa Peru Surya Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs