Advertisement
Google Ads BL

శివారెడ్డి కెరీర్‌కి కర్ణుడి చావన్ని కారణాలు!


కొందరు నటీనటులు ఎంతో టాలెంట్‌ ఉన్నా కూడా కొన్నిసార్లు అదృష్టం లేకపోతే పైకి రాలేరు. ఈ విషయంలో కేవలం 10శాతం టాలెంట్‌ ఉండి, 90శాతం అదృష్టం ఉన్నవారే బాగా పైకి వచ్చారు. ఇక కమెడియన్‌ శివారెడ్ది ఆ కోవలోకే వస్తారు. ఆయన నాడు తెలంగాణ నటుడు కావడంతో చాలా అవకాశాలు పోగొట్టుకున్నాడు. ఇక నాడు ఆయనకు బ్రహ్మానందంతో విబేధాలు వచ్చాయి. దాంతో బ్రహ్మానందం.. శివారెడ్ది నటిస్తే నేను నటించనని దర్శకనిర్మాతలకు చెప్పేవాడు. దాంతో వారికి బ్రహ్మానందమే ముఖ్యం కావడంతో శివారెడ్డిని పక్కనపెట్టేసేవారు. ఇక నాటి రోజుల్లో బ్రహ్మానందం.. శివారెడ్డి భార్యకి ఫోన్‌ చేసి ఏవేవో మాట్లాడాడని వార్తలు వచ్చిసంచలనం సృష్టించాయి. ఇలా శివారెడ్డి పైకి రాకపోవడానికి కర్ణుడి చావుకి ఎన్నికారణాలున్నాయో.. అన్ని ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈయన ఏదైనా చిత్రంలో నటిస్తే ఆయా ధియేటర్ల వద్ద ఈయన స్నేహితులు, అభిమానులు కటౌట్లు కట్టేవారు. అందులో నటించిన హీరోల కంటే పెద్ద కటౌట్లు ఉండటం ఆయా హీరోల ఇగోని దెబ్బతీసింది. ఇక ఓ ప్రముఖ నిర్మాత తన సినిమా వేడుకలకు ఉచితంగా స్టేజీషోలు, ఆడియో వేడుకల్లో స్పెషల్‌ పెర్‌ఫార్మెన్స్‌లు చేస్తే మంచి పాత్రలు ఇస్తానని చెప్పి ఆ తర్వాత మాట తప్పాడు. ఇక శివారెడ్డి స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్‌ కావడంతో స్టేజీ షోలలో ఎవరైనా పెద్ద వారిని ఇమిటేట్‌ చేస్తే ఆయా హీరోలు శివారెడ్డిని తప్పుగా అర్ధం చేసుకునే వారు. అది కేవలం కల్పితం, ప్రేక్షకులను నవ్వించడం కోసం చేసే పని అని కూడా వారు అర్ధం చేసుకోలేకపోయారు. 

ఇక శివారెడ్డి తన కెరీర్‌ ప్రారంభంలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు ఎన్నో చేశాడు. నిర్మాతలను నాకు అవి కావాలి? ఇవి కావాలి? అని డిమాండ్‌ చేసేవాడు కాదు. క్యారవాన్‌ నుంచి భోజనం వరకు నిర్మాత ఏది ఇస్తే అదే తీసుకునే వాడు. ఇంత రెమ్యూనరేషన్‌ కావాలి అని కూడా అడిగే వాడు కాదు. కానీ ఎందుకనో ఆయనకు సరైన అవకాశాలు, గుర్తింపు రాలేదు. మరి ఈ విషయంలో తనదేమైనా తప్పు ఉందా? అని ఆలోచిస్తున్నానని శివారెడ్డి అంటున్నారు. మీకు నచ్చినంత ఇవ్వమని చెప్పినా నిర్మాతలు రావడం లేదని, కారణం అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చాడు. స్టేజీ షోలు ఇవ్వడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ విషయం నిర్వాహకులు కూడా ప్రత్యక్షంగా చూసేవారు. 

ఇక నా షో అయిపోయిన వెంటనే నేనే నా బృందానికి నా సొంత డబ్బులు ఇచ్చేసేవాడిని. నిర్మాతలు కాస్త లేటుగా ఇచ్చినా తీసుకుందామని భావించేవాడిని. కానీ ఎంతో మంది డబ్బులు ఇవ్వలేదు. తర్వాత చూద్దాం అనేవారు. దాంతో నా డబ్బులే యూనిట్‌ని ఇచ్చేవాడిని. ఇవ్వన్నీ చూస్తుంటే దేవుడు నా మొహాన కేవలం మిమిక్రీ ఆర్టిస్ట్‌గానేఉండు అని రాసి ఉన్నాడేమో అనిపిస్తోందంటూ శివారెడ్డి తన బాధను వ్యక్తం చేశాడు. 

Comedian and Mimicry Artist Siva Reddy Exclusive Interview:

Siva Reddy is an Indian film actor and Mimicry artist starred in Telugu film industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs