Advertisement
Google Ads BL

అఖిల్ తో కాదు అల్లు అర్జున్ తో..!!


అఖిల్ మొదటి సినిమా తర్వాత బోలెడంత గ్యాప్ తీసుకుని రెండో సినిమా 'హలో' చేశాడు. ఆ సినిమా విడుదలై ఇప్పటికే రెండున్నర నెలలు అయినా మూడో ప్రాజెక్ట్ ని మొదలెట్టడానికి అఖిల్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. అఖిల్ జనవరి 10 న తన మూడో సినిమా విషయంలో ఒక ప్రకటన చేస్తానని అన్నారు. కానీ అఖిల్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. అందుకే అఖిల్ తో మూడో సినిమా చేసే దర్శకుడిగా అనేకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముందు సుకుమార్ అన్నారు. తర్వాత కొరటాల శివతో అఖిల్ అన్నారు. మళ్ళీ తొలిప్రేమ హిట్ అయ్యాక వెంకీ అట్లూరితో అఖిల్ మూడో ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. కానీ అఖిల్ - కొరటాల కాంబో మీదే ఎక్కువ న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి.

Advertisement
CJ Advs

కొరటాల శివ డైరెక్షన్ లో కొరటాల శివే తన ఫ్రెండ్ తో కలిసి అఖిల్ హీరోగా సినిమాని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తాడని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం కొరటాల - అఖిల్ కాంబోలో సినిమా లేనట్టే అంటున్నారు. ఎందుకంటే కొరటాలకి ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలని ఉంటుంది. అందుకే అటు రామ్ చరణ్ ని ఇటు ఎన్టీఆర్ తోనూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దామనుకుంటే....వారేమో రాజమౌళి ప్రాజెక్ట్ తో బిజీగా వున్నారు. ఇక మిగిలిన మహేష్ అండ్ ప్రభాస్ లు  కూడా బిజి. అందుకే కొరటాల ప్రస్తుతం ఖాళీగా వుంటున్న అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ బన్నీ కూడా కొరటాలకి లైన్ క్లియర్ చెయ్యకుండా సస్పెన్సు లో పెడుతున్నాడు.

అందుకే కొరటాల - అఖిల్ కాంబో తెరమీదకి రావడం నిజమే అనే న్యూస్ స్ప్రెడ్ అవడం జరిగాయి. కానీ అఖిల్ తో కొరటాల డ్రాప్ అయ్యి బన్నీ తో సినిమా చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉండడం వలన అఖిల్ తో మూవీ డ్రాప్ అయినట్లుగా చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ జస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొరటాల ఎప్పుడూ రెడీనే.

Koratala Siva to direct Allu Arjun?:

Koratala Not Interested in Akhil!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs