Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ రేంజ్ పెరుగుతుంది..!


వరుణ్ తేజ్ కు ఇప్పుడు మంచి టైం నడుస్తుంది. 'ఫిదా.. తొలిప్రేమ' ఇలా వరస హిట్స్ తో మంచి జోష్ మీద వున్నాడు. అదే జోష్ తో తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు వరుణ్. 'ఘాజీ' వంటి డిఫరెంట్ టేస్ట్ ని మనకి అందించిన కొత్త డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో అంతరిక్ష నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో వరుణ్ 'వ్యోమగామి'గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి జార్జియాలో భారీస్థాయిలో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి అక్కడే షూట్ మొత్తం కంప్లీట్ చేయనున్నారు టీం. ఇందుకోసం టీం ఆల్రెడీ జార్జియా వెళ్లిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎంపిక చేసుకున్నారట. వాళ్ల అధ్వర్యంలో .. సహాయ సహకారాలతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

పాత్రపరంగా వరుణ్ తేజ్ అవసరమైన శిక్షణ తీసుకోవడంలో బిజీగా వున్నాడు. సబ్ మెరైన్ సెట్ వేసి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచిన సంకల్ప్ రెడ్డి.. ఈ అంతరిక్షం సెట్ తో ఎలా మెస్మరైజ్ చేస్తాడో.. చూద్దాం. 

International stuntmen for Varun Tej's space film:

Hollywood Stunt Masters for Varun Tej Sankalp Reddy Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs