Advertisement
Google Ads BL

కేసీఆర్‌ వ్యూహరచన అర్థమైందా..!


సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు నందమూరి వారసులను, తోటి తోడల్లుడు, ఇతరులను పక్కన పెట్టి టిడిపిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎప్పటికైనా బాలయ్య నుంచి ప్రమాదం లేకుండా తన కుమారుడు లోకేష్‌ని బాలయ్యకి అల్లుడిని చేశాడు. హరికృష్ణ, దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వేంకటేశ్వరరావు నుంచి లక్ష్మీపార్వతి వరకు అందరినీ బలహీన పరిచాడు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ని, హరికృష్ణని వాడుకుని వదిలేశాడు. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్‌ ఠాక్రే మరణం తర్వాత ఏమి జరిగిందో తెలిసిందే. ఇక యూపిలో అఖిలేష్‌ యాదవ్‌, ఆయన తండ్రి ములాయంల విషయంలోనే ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. తెలంగాణలో కేసీఆర్‌ హవా మామూలుగా లేదు. ఆయన సీఎం. 

Advertisement
CJ Advs

ఇక ఆయన అనారోగ్య కారణాలు, త్వరలో ఢిల్లీకి వెళ్లాలనే నిర్ణయం తర్వాత టిఆర్‌ఎస్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మొదటి నుంచి కేసీఆర్‌కి అండగా ఉన్న మేనల్లుడు హరీష్‌రావుని బాగా తొక్కేశారు. ఎక్కడా ఆయన పేరు వినిపించకుండా చేశారు. ఇక కేసీఆర్‌ కుమార్తె కవిత ప్రస్తుతం ఎంపీగా ఉంది. ఇక ఈమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తోంది. దాంతో జగిత్యాల నియోజక వర్గంపై దృష్టి పెట్టి, యాక్టివ్‌గా ఉంటోంది. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. కేసీఆర్‌ ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్లితే కేటీఆర్‌కి తిరుగులేకుండా చేసేందుకు కన్న కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌రావుల విషయంలో కూడా కేసీఆర్‌ ముందు చూపుతో ఉన్నాడు. 

కవితని ఎమ్మెల్యేగా కాకుండా నిజామాబాద్‌ నుంచే మరోసారి ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్‌ ఆదేశించాడని తెలుస్తోంది. హరీష్‌రావుని కూడా పార్లమెంట్‌కి పంపడం లేదా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దగా ప్రాధాన్యం లేని విధంగా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

KCR's Superb Strategy Revealed:

Telangana CM KCR Strategy For 2019 Elections  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs