'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక చైనీస్, జపనీస్, జర్మనీ వంటి భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఆయన నటించే తదుపరి చిత్రం 'సాహో'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందునా ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. హిందీ బాధ్యతలను కరణ్ జోహార్‌కి అప్పగించడంతో నిర్మాతలు మరింత భరోసాగా, మరింత బడ్జెట్‌ని పెంచారు. అయితే దర్శకుడు మాత్రం 'రన్ రాజా రన్' వంటి ఒకే చిత్రం అనుభవం ఉన్న సుజీత్. ఇక ఈ చిత్రం ప్రభాస్ ఓన్ బేనర్ వంటి యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందనుంది. ఇక ఈ చిత్రం కోసం నీల్ నితిష్, జాకీష్రాఫ్, చుంకీపాండే వంటి వారితో పాటు తమిళ నటులకు కూడా బాగానే ప్రాధాన్యం ఇస్తూ ఇది మూడు భాషల వారు ఓన్ చిత్రంగా ఫీలయ్యేలా టచప్స్ ఇస్తున్నారు. ఇక హీరోయిన్‌గా శ్రద్దాకపూర్‌ని ఎంచుకోవడం మరో ప్లస్ పాయింట్. ఈమె వల్ల బాలీవుడ్‌లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇక ఎలాగూ బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్‌లు సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇందులో బాలీవుడ్ నటి, క్రికెట్ యాంకర్‌గా, శింబు 'మన్మథ'లో కూడా నటించిన మందిరాబేడీని కూడా తీసుకున్నారు. ఆల్‌రెడీ ఈమధ్య ఈ భామ ఓ ఇంటర్వ్యూలో తాను పోలీస్, డాన్ పాత్రలకే సూట్ అవుతానని చెప్పింది. అన్నట్లుగానే ఈ చిత్రంలో ఆమె ఓ డాన్ పాత్రను పోషిస్తోందట. ఇక ఇందులో శ్రద్దాకపూర్ కూడా ద్విపాత్రాభినయం చేస్తోందా? లేదా రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోందా? అనే ఆసక్తి కలుగుతోంది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా, గ్రామీణ యువతిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రను చేయనుందని తెలుస్తోంది. ఇక 'సాహో' చిత్రంలోని ప్రభాస్ లుక్‌ని పోయిన ఏడాది అక్టోబర్‌లోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా శ్రద్దాకపూర్ ఫొటోని రిలీజ్ చేశారు. శ్రద్దాకపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్దానాయక్ అకౌంట్ నుంచి ఇది విడుదలై వైరల్ అవుతోంది. సహజంగా అందగత్తె అయిన శ్రద్దా ఇందులో మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో ఈ చిత్రం యూనిట్ తనకు ఎంతో సహకరించిందని, తన ఇంట్లో ఉన్నట్లే ఫీలయ్యాయని శ్రద్దా నాడు చెప్పుకొచ్చింది.
ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను లాంగ్ షెడ్యూల్‌లో దుబాయ్‌లో చిత్రీకరించనున్నారని వార్తలు వస్తుంటే మరికొందరు మాత్రం దుబాయ్ ప్రభుత్వం నుంచి వారికి ఇంకా పర్మిషన్ రాలేదని, దాంతో హైదరాబాద్‌లోనే సెట్స్‌వేసి భారీ ఖర్చుతో ఆ సీన్స్‌ని చిత్రీకరించనున్నారని అంటున్నారు. చూద్దాం.. దీనిలో ఏది నిజమో...!