Advertisement
Google Ads BL

ఎఫైర్ అంటూ వార్తలొచ్చినా.. మళ్లీ ఆ హీరోతోనే!


క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ నిర్మాణంలో రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన 'కుమారి 21 ఎఫ్‌' అనే బోల్డ్‌ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన హెబ్బాపటేల్‌ మొదటి చిత్రంతోనే యువత గుండెలను కొల్లగొట్టింది. కాస్త అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఈ చిత్రం ఆమెకి మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక ఈమె ఆ తర్వాత 'ఈడో రకం..ఆడోరకం' చిత్రంతో పాటు రాజ్‌తరుణ్‌ సరసన వరుసగా నటించడంతో ఈమెకి రాజ్‌తరుణ్‌కి మధ్య సమ్‌థింగ్‌ ఏదో ఉందని వార్తలు వచ్చాయి. ఇక తనకు కూడా రాజ్‌తరుణ్‌తో నటించడం బోర్‌ కొట్టిందని, ఇక రాజ్‌తరుణ్‌కి తనకి ఏమీ ఎఫైర్‌ లేదని చెప్పింది. ఆ తర్వాత ఈమె నిఖిల్‌ నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ సారి ఆమె మరో పెద్ద డబ్బున్న అబ్బాయి నాగాన్వేష్‌ హీరోగా నటించిన 'ఏంజెల్‌'లో నటించి, నిజంగానే ఏంజెల్‌లా కనిపించినా కూడా ఎక్కడికి వెళ్లినా నాగాన్వేష్‌తో పాటు ఈమె కూడా ప్రత్యక్షమవుతూ ఉండటంతో వీరిమధ్య కూడా వార్తలు బాగానే వచ్చాయి. ఇక ఈమె ఇటీవల కాస్త లావుగా తయారై, తన స్లిమ్‌లుక్‌ని పోగొట్టుకుంది. దాంతోనే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదని, ఇలా అయితే ఆమె హెబ్బా ఆంటీగా మారడం ఖాయమనే విమర్శలు వచ్చాయి. ఇవి ఆమె చెవి వరకు చేరినట్లుగా ఉంది. దీంతో ఈమె తన ఫిట్నెస్‌పై దృష్టిపెట్టింది.

కాస్త స్లిమ్‌గా, గ్లో తెచ్చుకుంది ఇప్పుడు ఆమె మరోసారి మరలా నాగాన్వేష్‌ సరసనే నటిస్తుండటంతో మరలా వీరిద్దరి మధ్య వార్తలు గుప్పుమనడం ఖాయమని అనిపిస్తోంది. లండన్‌ గణేష్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. మరి ఈ సినిమా అయినా ఆమెకి మరలా పూర్వవైభవం తెస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.

Hebah Patel in Naga Anvesh's film:

Naga Anvesh To Romance Hebah Patel Again  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs