Advertisement
Google Ads BL

రకుల్ మాట మార్చేసింది..!


చిన్నగా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో జోడి కట్టి టాప్ రేంజ్ కి చేరుకున్నాక కూడా... చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ గత ఐదేళ్లుగా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ... టాలీవుడ్ లో మాత్రం పూర్తిగా ఖాళీ అయ్యింది. నిన్నమొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఈ భామ ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ వలన గట్టి పోటీ ఎదుర్కొంటూ వెనుకబడిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్స్ వైపు చూడడంతోనే రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ సినిమాలు తగ్గిపోయాయి.

Advertisement
CJ Advs

అయితే టాప్ రేంజ్ లో ఉన్న రకుల్ ప్రీత్ రెమ్యూనరేషన్ కూడా అంతే టాప్ రేంజ్ లో ఉండడంతో... ఆమెని టాలీవుడ్ దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే దర్శకనిర్మాతల బాధని రకుల్ పసిగట్టినట్టుగా కనబడుతుంది. తనకి అవకాశాలు తగ్గడానికి రెమ్యూనరేషన్ కారణమని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుంది రకుల్ వ్యవహారం. రకుల్ ప్రీత్ ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. కథా కథనాలతో పాటు ఆ సినిమాలో తన పాత్ర బాగుంటే చాలంటూ మాట మార్చేసిందని అంటున్నారు.

మరి రకుల్ ప్రీత్ ఇలాంటి డెసిషన్ తీసుకోకపోతే మరో పదికాలాల పాటు టాలీవుడ్ లో మనగలగడం కష్టం. నిన్నమొన్నటి వరకు తానే సినిమాలు ఒప్పుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నాని బిల్డప్స్ ఇచ్చిన రకుల్ కి ఇప్పుడు బాగా జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. అందుకే తన పారితోషికాన్ని తగ్గించేసింది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. 

Rakul Preet Singh Reduce her Remuneration :

Rakul Preet Singh Shocking Decision on Her Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs