Advertisement
Google Ads BL

మహేష్ లో ఇంత మార్పా...?


బ్రహ్మోత్సవం సినిమా టైం లో మహేష్ బాబు సినిమాల కథలను మహేష్ భార్య నమ్రత కూడా వింటుందని... మహేష్ కి సంబందించిన సోషల్ మీడియా కానివ్వండి బిజినెస్ వ్యవహారాలు కానివ్వండి అన్ని ఆమె చక్కబెడుతుందనే వార్తలు ఫిల్మ్ నగర్ సాక్షిగా చక్కర్లు కొట్టాయి. అసలు మహేష్ ని ఏ డైరెక్టర్ నిర్మాత కలవాలన్నా ముందు నమ్రతని కలిస్తేనే పనిజరుగుతుందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం మహేష్ భార్య నమ్రత న్యూస్ మాత్రం పెద్దగా బయటికి రావడం లేదు. అయితే మహేష్ ఆ వార్తలన్నింటికీ చెక్ పెట్టేందుకే సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరించే విషయాన్ని వదిలేశాడనే టాక్ మాత్రం వినబడుతుంది.

Advertisement
CJ Advs

గతంలో మహేష్ బాబు ఇకపై చేసే సినిమాలకు సహా నిర్మాతగా వ్యహరిస్తానని చెప్పడమే కాదు అందులో భాగంగా గత రెండు సినిమాలకి మహేష్ తన ప్రొడక్షన్ ని లింక్ చేశాడట. కానీ నమ్రత తన సినిమాలు ఎవరికి అమ్మాలి.. ఎవరికి అమ్మకూడదు అనే విషయాలు చూసుకుంటుందని న్యూస్ బయటికి రావడంతో మహేష్ తన తాజా సినిమాల నిర్మాణ భాగస్వామ్యంపై దృష్టి సారించలేదట. అందులో భాగంగానే తన సినిమాలకి తనకి ఎంత పారితోషకం రావాలో అంత తీసుకుని నిర్మాణ పనుల విషయంలో వేలెట్టడం మానేశాడట. అసలు సినిమా బడ్జెట్‌ కంట్రోల్‌ నుంచి అమ్ముతున్న రేట్ల వరకు దేనిపై కూడా మహేష్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదట.

అయితే సినిమా డిజాస్టర్స్ అయినప్పుడు బయ్యర్లు హీరోలని కార్నర్ చేసి మాట్లాడే విషయంలో మహేష్ మాత్రం దానికి వ్యతిరేకంగా వున్నాడట. హిట్ అయినా ఫట్ అయినా హీరోలు చేసే సినిమాలకు ఒకటే కష్టపడాలి. అందుకే సినిమా ఫెయిల్యూర్ అయితే హీరోని మధ్యలో లాగడం ఎందుకు... ఆ పంచాయితీలేవో నిర్మాతలే పెట్టుకోవాలని నిర్మతలతో ఖరాఖండిగా చెబుతున్నాడట మహేష్. అంటే మహేష్ ఈ నిర్ణయంతో గత సినిమాల డిజాస్టర్స్ తో ఇలా మారిపోయాడా అనే డౌట్ వస్తుంది అందరికి.

Big Change in Mahesh:

Mahesh Mind Set Changed with Flop Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs