Advertisement
Google Ads BL

భరత్ కి కైరా ఏమవుతుందో తెలుసా?


ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొరటాల శివ - మహేష్ కాంబోలో వస్తున్న 'భరత్ అనే నేను' ముచ్చట్లే. ఎందుకంటే 'భరత్ అనే నేను'.... 'విజన్ ఆఫ్ భరత్' ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు మొదటిసారి సీఎం పాత్రలో యంగ్ సీఎంగా మెరిసిపోతున్నాడు. రాజకీయ నాయకుడిగా మహేష్ లుక్ ప్రేక్షకులు, అభినానుల్లోకి ద విజన్ ఆఫ్ భరత్ తో బాగా వెళ్ళింది. మహేష్ బాబు ఎంతో అందమైన, ఎనర్జిటిక్, యంగ్ సీఎంగా అదరగొట్టేస్తుంటే... ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ మాత్రం జనాల్లో బాగా వచ్చేసింది. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ నుండి మొదటిసారి టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కి జోడిగా నటిస్తున్న ఈ కైరా అద్వానీ 'భరత్ అనే నేను' లో ఎలా కనిపించబోతుందో తెలుసా.... ఈ సినిమాలో భరత్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణం చేసే మహేష్ బాబుకి పిఏ గా కనబడబోతోందట. అయితే ఈ మధ్యన కొన్ని బడా సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు అస్సలు ప్రాధాన్యతే ఉండడం లేదు. కానీ భారత్ అనే నేనులో కైరా అద్వానీ పాత్ర చాలా కీలకమంటున్నారు. కేవలం పాటలకే పరిమితమవుతున్న హీరోయిన్స్ లా కాకుండా  సినిమా మొత్తం మహేష్ బాబు కష్ట సుఖాల్లో అండగా నిలబడుతోందట. మరి అలాంటి సమయంలోనే సీఎంకి ఆయనగారి పీఏకి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుందనే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు మహేష్ అభిమానులు.

కాకపోతే కైరాకి టాలీవుడ్ లో మొదటి సినిమాకే  గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం ఒక అదృష్టమని చెప్పాలి. మరి మహేష్ అండ్ కైరా అద్వానీల రొమాంటిక్ పెరఫార్మెన్సు చూడాలి అంటే వచ్చేనెల అంటే ఏప్రిల్ 20 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. 

Kiara Advani Role Revealed in Bharat Ane Nenu:

Kiara Advani PA to Mahesh Babu in BAN
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs