Advertisement
Google Ads BL

బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.. కానీ..?


ఒకవైపు తన తండ్రి ఎన్టీఆర్‌ బయపిక్‌గా 'బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌, వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి లక్ష్మీస్‌ వీరగ్రంధం' చిత్రాలను అనౌన్స్‌ చేశారు. మిగిలిన రెండింటి విషయం తెలియడం లేదు గానీ బాలకృష్ణ తీసే ఎన్టీఆర్‌ బయోపిక్‌పై మాత్రం క్లారిటీ వచ్చింది. ఈనెల 29న ఈ చిత్రాన్ని మొదటి షెడ్యూల్‌ని ప్రారంభిస్తున్నామని స్వయంగా బాలకృష్ణ ప్రకటించాడు. వెలగపూడిలోని అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ బయోపిక్‌కి రాజకీయాలకు, ఎన్నికలకు సంబంధం లేదని తేల్చిచెప్పాడు. పలువురు పలు టైటిల్స్‌ సూచించారని కానీ 'ఎన్టీఆర్‌' అనే టైటిల్‌ని మించినది లేదని భావించి దానినే టైటిల్‌గా ఖరారు చేశామని చెప్పారు. పార్టీల కతీతంగా ఎన్టీఆర్‌ని అందరు అభిమానిస్తారని తెలిపాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్లను, ప్రారంభోత్సవాన్ని కూడా హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌లోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. మరి వారి ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిందా లేదా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. పూర్తిగా స్క్రిప్ట్‌ని కొందరు ఎన్టీఆర్‌కి అనుబంధం ఉన్న రచయితలు, సాయిమాధవ్‌ బుర్రాలతో బాలయ్య అన్ని తన కనుసైగలతోనే రూపొందించి, కేవలం తేజకి దర్శకత్వం బాధ్యతలు మాత్రమే ఇస్తాడని వార్తలు వచ్చాయి. మరోపక్క తేజ, వెంకటేష్‌తో చేయబోయే చిత్రం 'ఆటా నాదే వేటా నాదే' చిత్రం ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ని పూర్తి చేసుకుని షూటింగ్‌కి రెడీగా ఉంది. మరోవైపు ఈనెల 29నే ఎన్టీఆర్‌ చిత్రాన్ని స్టార్ట్‌ చేసి వచ్చే సంక్రాంతి నాటికి సినిమాను విడుదల చేస్తామని బాలయ్య ప్రకటించాడు. 

ఇందుకు సంబంధించిన ఆయన తన ముఖ్యులను, నిమ్మకూరులోని తన బంధువులను, ఇతర తన సన్నిహిత నాయకులను ఈ వేడుకకు స్వయంగా ఆహ్వానిస్తున్నారు.. మరి ఈ మూవీని తేజ డైరెక్ట్‌ చేస్తాడా? లేక బాలయ్యే నిర్మాణ భాగస్వామిగానే గాక దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతాడా? అనేది వేచిచూడాల్సివుంది.

Balakrishna's NTR Film from 29th:

NTR Biopic: Balayya Breaks the Ice  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs