Advertisement
Google Ads BL

సాయి పల్లవి భలే కవర్ చేసింది..!!


సాయి పల్లవికి కాస్త పొగరెక్కువ, ఆమెతో నటించే  హీరోలను అస్సలు లెక్క చెయ్యదు, సాయి పల్లవి వలన దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు... ఇది సాయి పల్లవి మీద గత కొంత కాలంగా హల్చల్ చేస్తున్న న్యూస్. అయితే సాయి పల్లవి మీద ఎన్ని వార్తలొచ్చిన గాసిప్స్ లిస్ట్ లో కలిసిపోయేవే. కానీ 'కణం' సినిమాలో సాయి పల్లవికి జోడిగా నటించిన నాగశౌర్య మాత్రం సాయి పల్లవికి తలబిరుసు ఎక్కువని తీవ్ర స్థాయిలో విమర్శించేసరికి.... సాయి పల్లవి మీద వస్తున్నా వార్తలు నిజమని అందరు ఫిక్స్ అయ్యారు. అందుకే నాగశౌర్య కూడా 'కణం' ప్రమోషన్స్ లో అస్సలు పార్టిసిపేట్ చెయ్యడం లేదు.

Advertisement
CJ Advs

సాయి పల్లవి మీద ఉన్న కోపంతోనే చెన్నైలో 'కణం' ఆడియోకి వెళ్లని నాగశౌర్య, హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లలేదు. అని అందరూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తన వల్ల హీరో నాగశౌర్య ఇబ్బంది పడలేదని... అసలు అలాంటి ఇబ్బంది షూటింగ్ స్పాట్ లో ఏమన్నా జరిగిందా అని దర్శకుడు విజయ్ కి ఫోన్ చేసి అడిగితే అలాంటిదేం లేదని విజయ్ చెప్పారని... ఒకవేళ తన వల్ల నాగశౌర్య బాధపడితే సారీ అని చెప్పడమే కాదు... తన మీద ఎలాంటి తప్పు లేకుండా బాగానే కవర్ చేస్తోంది ఈ పాప.

నాగశౌర్య తన ఎలాంటి బాధ పడలేదని చెబుతున్న సాయి పల్లవి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశౌర్య మంచి హీరో అని... గొప్ప నటుడని.. సినిమాలో అతను ఇచ్చిన హావభావాల్ని తాను ఇవ్వలేకపోయానని చాలా పాజిటివ్ గా మాట్లాడింది. మరి ఇదంతా చూస్తుంటే తనకే పాపం తెలియదని బాగానే కవరింగ్ చేసుకుంటుంది అని అనిపించడం లేదు.

Naga Shaurya avoiding Sai Pallavi, skips Kanam event:

Sai Pallavi about Naga Shaurya at Kanam pre Release event    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs