Advertisement
Google Ads BL

సన్ని కీర్తికిరీటంలో మరో మైలురాయి!


ప్రస్తుతం దేశంలో ఎవ్వరికీ లేని క్రేజ్‌ పోర్న్‌స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నిలియోన్‌కి ఉంది. ఇక గూగుల్‌లో వికీపీడియా సెర్చ్‌లో నెటిజన్లు ఎవరి కోసం ఎక్కువగా శోధించారు? అని చేసిన సర్వే వివరాలను వికీపీడియా రిలీజ్‌ చేసింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అని ప్రకటించగా, ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కన్నా సన్నిలియోన్‌ ముందుండటం ఆసక్తిని రేపుతోంది. మొత్తంగా టాప్‌ 32 మందిలో హాలీవుడ్‌ స్టార్స్‌ లియనార్డో డిక్రాపియో, బ్రాట్‌ పిట్‌, ట్రామ్‌ క్రూయిజ్‌ వంటి వారిని కూడా వెనక్కి నెట్టి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ రెండో స్థానం దక్కించుకున్నాడు. అగ్రస్థానంలో అమెరికన్‌ టీవీ నటి కిమ్‌ కర్దాషియన్‌ నిలిచింది. సన్నిలియోన్‌ 20వ స్థానం దక్కించుకోగా, పాపం సల్లూ భాయ్‌ మాత్రం 29వ స్థానంతో సర్దుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఏడాది కిందటి వరకు సన్నిలియోన్‌ దంపతులకు పిల్లలు లేరు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లి అయిపోయింది ఈ భామ. ఇప్పటికే వారు మహారాష్ట్రకి చెందిన ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు సరోగసీ ద్వారా ఆ ఇంట్లో మరో కవల జంట చేరింది. ఇలా సన్ని ఇల్లు ప్రస్తుతం పిల్లలతో సందడిగా మారింది. దేవుడు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. అందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సన్నిలియోన్‌ వ్యాఖ్యానిస్తూ తన భర్త, ముగ్గురు పిల్లలతో కూడిన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీంతో అందరు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేస్తున్నారు. అంటే సన్ని ఇప్పుడు ఏకంగా ముగ్గురు పిల్లలకి తల్లి హోదాను సాధించుకుంది. 

Sunny Leone Surprises With Twins:

Sunny Leone Becomes a Surrogate Mother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs