Advertisement
Google Ads BL

ఆడాళ్ల గురించి లెక్చర్‌ ఇచ్చిన రాశి!


బాలనటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌ రాశి. ఇక రాశి తాజాగా మాట్లాడుతూ, ఆడవారి ఇండిపెండెన్స్‌, సంసారం ఎలా సాగాలి? అనే విషయాలను బోలెడు నాలెడ్జ్‌తో చెప్పింది. ఆమె మాట్లాడుతూ, సినిమా అనేది మేల్‌డామినేటెడ్‌ ఇండస్ట్రీ, కానీ ఇక్కడ కంటే మలయాళం, తమిళంలో బెటర్‌. తెలుగులో మేల్‌ డామినేషన్‌ మరీ ఎక్కువ. ఇక పారితోషికం కూడా ఒకప్పుడు మా టైంలో హీరోకి 70లక్షలు ఇస్తే మాకు ఆరేడు లక్షలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఫర్వాలేదు. హీరోకి మూడుకోట్లు ఇస్తే హీరోయిన్‌కి కోటి ఇస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పెళ్లిచూపులప్పుడు అబ్బాయిని అమ్మాయి నచ్చిందా? అని అడుగుతారే గానీ అమ్మాయిని అబ్బాయి నచ్చాడా? అని అడగరు. జీవితాంతం కలిసి ఉండాల్సినప్పుడు అమ్మాయి డెసిషన్‌ కూడా తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే ఆ మార్పు వస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఆడాళ్లు ఎవరి మీద ఆధారపడకూడదు. ఆర్ధికంగా ఇండిపెండెంట్‌గా ఉండాలి. తమ చదువుకి, తమకి చేతనైన పని చేసి డబ్బు సంపాదించాలి. డిపెండెంట్‌గా ఉంటే ఇన్‌సెక్యూరిటీ ఏర్పడుతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతారు. ధైర్యంగా డెసిషన్‌ తీసుకోలేరు. ఇండిపెండెంట్‌ ఉమెన్‌కి ఆత్మవిశ్వాసం వుంటుంది. తాను సంపాదిస్తూనే ఫ్యామిలీ మెంబర్స్‌ మీద డిపెండ్‌ కావడంలో కూడా తప్పులేదు. ఇక నా సమయంలో నేను బాలనటిని కాబట్టి నేను ఏ చిత్రాలు చేయాలి? ఎలా నటించాలి? అనే వాటిపైనే దృష్టిపెట్టి మిగిలిన ఫైనాన్స్‌ విషయాలన్నీ తల్లిదంద్రులకు, సోదరులకు అప్పగించాను. కానీ నేటి జనరేషన్‌ అమ్మాయిలు మరీ చిన్న వయసులో రావడం లేదు. పక్కన అమ్మానాన్న లేకుండా స్టాఫ్‌ ఉంటే చాలు.. అన్ని వారే చూసుకుంటూ ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? లైఫ్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడం ఎలా అనే విషయాలలో మెచ్యూరిటీ చూపిస్తున్నారు. హీరోయిన్లే కాదు.. ఆడాళ్లందరు తెలివిగా ఉండాలి. ఎవరి చేతిలోనో మనలైఫ్‌ని పెట్టేస్తే ఎలా? ఉన్న ఒక్కలైఫ్‌ని పక్కవారి చేతిలో పెట్టకూడదు. ఇక ఇంట్లో డెసిషన్‌ మేకింగ్‌ అనేది ఆడాళ్ల చేతిలో ఉంటేనే మంచిది. ఎందుకంటే పుట్టినిల్లు, మెట్టినిల్లు.. ఇరువైపుల వారని బ్యాలెన్స్‌ చేసేది మహిళే. 

ఇక కేవలం నా మాటే వినాలి అనే పద్దతి ఇద్దరకీ మంచిది కాదు. ఎవరికి ఏ విషయంలో పట్టుంటే వారు డెసిషన్‌ తీసుకోవాలి. అంతేకాదు పంతాలకు పోకూడదు. ఫలానా విషయంలో నాకంటే నీకే బాగా నేర్పు ఉంది కాబట్టి నువ్వు డెసిషన్‌ తీసుకో అని భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకొని, అర్ధం చేసుకోవాలి. ఇక మగాళ్ల కంటే ఆడాళ్లు ఎక్కువగా సంపాదిస్తే గొడవలు వస్తాయి. అందరు మేడమ్‌ మేడమ్‌ అంటూ ఆమెకే ఎక్కువ విలువ ఇస్తారు. దానిని భర్తమీద డామినేషన్‌గా చూపిస్తే, పిల్లలు, బంధువులలో కూడా భర్త చులకన అవుతాడు. ఎవరు ఎంత సంపాదించినా మన కుటుంబం కోసమే కదా? అని భావిస్తే ఇబ్బంది ఉండదు. మగాళ్లు కూడా అలాగే సర్దుకుపోవాలి. ఆడాళ్లు ఎక్కువగా సంపాదిస్తే తప్పేమి లేదు. కానీ ఇద్దరు పరస్సర అవగాహన కలిగి ఉండటం ముఖ్యం అని చెప్పుకొచ్చింది రాశి. 

Heroine Raasi Latest Interview:

Heroine Raasi About Human Life 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs