Advertisement
Google Ads BL

యంగ్‌టైగర్‌ ఇరగదీస్తున్నాడు...!


ఒకప్పుడు పాత్రలకి తగ్గట్లు మేకోవర్‌ అంటే హాలీవుడ్‌ తర్వాత బాలీవుడ్‌ కేరాఫ్‌ అడ్రస్‌లుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇది టాలీవుడ్‌కి కూడా పాకింది. కథ, పాత్రల డిమాండ్‌ మేరకు మన స్టార్స్‌ కూడా చెమటోడుస్తున్నారు. బరువులు పెరగడం, వెంటనే తగ్గడం చేస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్‌, అల్లుఅర్జున్‌లు ముందజలో ఉంటే ఇప్పుడే తారక్‌ ఆ దారిలో నడుస్తున్నాడు. 'టెంపర్‌' కోసం సిక్స్‌ప్యాక్‌ చేసి, 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో డిఫరెంట్‌ హెయిర్‌ స్టయిల్‌, గడ్డంతో కనిపించాడు. కానీ మరలా 'జై లవకుశ' వచ్చే సరికి మరలా పాత దారిలోనే నడుస్తున్నాడా? అనే అనుమానం వచ్చింది. కానీ త్రివిక్రమ్‌ చిత్రం కోసం ఎన్టీఆర్‌ భారీగా మేకోవర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన నవ్వుతూ, సన్నబడి, మొహం కూడా మంచి గ్లో వచ్చి స్లిమ్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపిస్తూ ఉండటంతో యంగ్‌టైగర్‌ అభిమానుల సంతోషానికి అవధులే లేవు. ఇక ఈ చిత్రం కోసం ఆయన బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌, రణవీర్‌సింగ్‌ వంటి వారి ట్రైనర్‌ లాయిడ్స్‌ స్టీవెన్‌ ఎన్టీఆర్‌కి జత కలిశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో 'ఇంకా పూర్తి కాలేదు' అనే కామెంట్‌ పెట్టడం, ఎన్టీఆర్‌ జిమ్‌ వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారాయి. అంటే ఇంకా పూర్తయ్యే సరికి ఎన్టీఆర్‌ మరెంత స్లిమ్‌ అండ్‌ స్టైలిష్‌గా మారుతాడో అని టైగర్‌ అభిమానులు ఆశగా కోటి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. మరి ఇది కేవలం త్రివిక్రమ్‌ చిత్రం కోసమేనా? లేక ఆ తర్వాత చేయబోయే రాజమౌళి, రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్‌కి కూడా ఇదే లుక్కా? లేక దానికోసం మరో విధంగా మారుతాడా? అనేవి వెయిట్‌చేయాల్సివుంది...! 

దీంతో పాటు రాజమౌళి చిత్రంలో కీలకపాత్రలో అల్లుఅర్జున్‌ కూడా కనిపించనున్నాడని, రామ్‌చరణ్‌కి జోడీగా మరోసారి సమంత, ఎన్టీఆర్‌ కోసం మరోసారి కాజల్‌లు నటిస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతో తెలియదు గానీ ఇతర నటీనటులు ఇంకా ఫైనలైజ్‌ కాలేదని అంటున్నారు. 

Young Tiger NTR’s Look For Trivikram Srinivas Film:

Young Tiger NTR’s New Look Resembles That Of Rabhasa  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs