Advertisement
Google Ads BL

మాకు బాధలుంటాయ్: తమన్నా..!


మొన్నామధ్యన సినిమా తారల లైఫ్ చాలా కాస్ట్లీగా ఉంటుందని అందరూ అనుకుంటారు.. కానీ వారెప్పుడు అందాన్ని కాపాడుకోవడానికి, అలాగే అందమైన డ్రెస్సుల్లో అభిమానులకు కనబడాలనే తపనతో నిత్యం ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి చాలానే కష్టపడాలి. అలాగే హీరోయిన్స్ ని కేవలం కాస్ట్లీ వస్తువులు గానే చూస్తారు.. వారి కుండే సమస్యలు వారికీ ఉంటాయని ఏకరువు పెట్టింది లెజెండ్ భామ రాధికా ఆప్టే. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా  హీరోయిన్స్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది. ఆమె ఎవరో కాదు.. బాహుబలి తర్వాత భారీ గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ తో కలిసి నటిస్తున్న తమన్నా.

Advertisement
CJ Advs

తమ జీవితం ఎంతో ఆడంబరంగా కనబడే జీవితమే కానీ... అందులో ఆనందమే ఉండదని చెబుతుంది తమన్నా. హీరోయిన్స్ అనేవారు ఎవరు అసలు సంతోషకర జీవితాన్ని గడపలేరని... వారికీ షూటింగ్స్ తోనే సగంపైగా జీవితం కరిగిపోతుంది.. రాత్రిమ్బవళ్ళు  షూటింగ్ ల్లో పాల్గొంటూ కష్టపడాలని చెప్పడమే కాదు... షూటింగ్ స్పాట్ లో రెడీ అనే పదం వినబడగానే వెంటనే షాట్ కి తయారుగా వెళ్లి నిలబడాలని.... మనసులో ఎన్ని బాధలున్న కెమెరా ముందు మాత్రం ఆ ఫీలింగ్స్ బయటపడకుండా ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టాలని చెబుతుంది. అలాగే ఫ్రెండ్స్ తోనూ, కావాల్సిన వారితో కలిసి తిరగాలని ఉన్నా కుదరదని తన మనసులోని బాధను, హీరోయిన్స్ లైఫ్ ని ఏకరువు పెడుతుంది.

అంతేకాకుండా నాజూగ్గా.... సన్నగా ఉండాలనే తాపత్రయంతో కావాల్సినవి తినడానికి కూడా అదృష్టముండదని... బయట మాములుగా తిరిగే అమ్మాయిలను చూస్తుంటే వాళ్ళలా మేము ఉండలేకపోతున్నామనే ఫీలింగ్ ఉంటుంది చూడండి ఆ బాధ వర్ణనాతీతం అంటూ... ఇండస్ట్రీలో పదికాలాలు నిలబడాలంటే.... ఇక్కడ దర్శక నిర్మాతలు చెప్పినట్టుగా నడుచుకోవాలని చెబుతుంది. మరి తమన్నా చెప్పింది పూర్తిగా నిజమే. హీరోయిన్స్ అద్దాల మెడల్లో ఉన్నా... వారూ మాములు మనుషులే కదా.

Tamannah's Theory on Heroine Life Style:

Tamannah  recently opened up about the life of an actress and what goes into the making of a star heroine to entertain the audiences.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs