Advertisement
Google Ads BL

సీఏంగా మహేష్ టైమెంతో తెలుసా..?


మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్టర్ గా రూపొందుతున్న చిత్రం 'భరత్ అనే నేను’. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం. అయితే ఈ సినిమాలో మహేష్ ఎంతసేపు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. సినిమా మొత్తం కనిపిస్తాడా.. లేక కొన్ని సీన్లకే పరిమితమా.. అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Advertisement
CJ Advs

అయితే మహేష్ ఈ సినిమాలో ఎక్కువసేపు ముఖ్యమంత్రిగా కనిపించడంట. అతన్ని ఎన్నారైగా పరిచయం చేసి..లండన్ నేపథ్యంలో కథను నడిపించి.. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తారట. ఇండియా వచ్చాక అనుకోకుండా మహేష్ సీఏం అవుతాడంట. మొత్తంగా ఓ 30 నిముషాలు కనిపించొచ్చని సమాచారం.

కొరటాల తన ప్రతి సినిమాలో ఏదొక మెసేజ్ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా ఓ గొప్ప సందేశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Mahesh to Appear As a CM for 30 Minutes!:

<span>Mahesh Babu's CM Role Lasts for 30 Minutes!</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs