Advertisement
Google Ads BL

సాయిపల్లవి డేరింగ్ డెసిషన్ అందుకే..!


తమిళ అమ్మాయి అయిన సాయిపల్లవి మలయాళ 'ప్రేమమ్‌'తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ పింపుల్స్‌ బ్యూటీ. ఈమె సాధారణంగా మేకప్‌ వేసుకోదు. ఒరిజినల్‌గా ఎలా ఉంటే అలాగే నటిస్తుంది. మొటిమలు మొహంపై ఉంటే గిల్టీగా ఫీలయ్యే వారికి అది కూడా ఓ అందమేనని ఇప్పటికే సాయిపల్లవి ప్రూవ్‌ చేసింది. ఇక నేను పెద్దగా మేకప్‌ వేసుకోను. నేను సహజంగా కనిపించడానికే ఇష్టపడతాను, వితౌట్‌ మేకప్‌ కూడా మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలని భావిస్తాను. నా ద్వారా అమ్మాయిలలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేలా చేస్తున్నాను. 

Advertisement
CJ Advs

ఇక నా మొదటి చిత్రం 'ప్రేమమ్‌' దర్శకుడు అల్ఫోన్స్‌ పుతెరిన్‌ కూడా దీనికి ఓ కారణం. ఆయన తన చిత్రంలో తాను నేచురల్‌గా ఉండాలని, నేచురల్‌గా కనిపించాలని, నటించాలని చెప్పేవాడు. అలాగే నేను పనిచేసిన దర్శకులందరూ నాలో నా ఆత్మవిశ్వాసం పెరగడానికి, నేను నేచురల్‌ గెటప్‌లో ఉండేలా దోహదపడ్డాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఈమె ప్రస్తుతం నాగశౌర్యతో లైకా ప్రోడక్షన్స్‌ బేనర్‌లో దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో నటించిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం మార్చి9 వ తేదీన తెలుగులో 'కణం'గా విడుదల కానుంది. 

మరోపక్క ఈమె తమిళస్టార్‌ ధనుష్‌ సరసన 'మారి 2'లో నటిస్తోంది. ఈ చిత్రానికి విజయ్‌ దర్శకుడు. మరి ఇప్పటికే క్రమశిక్షణ విషయంలో ఈ మలయాళ బ్యూటీపై పలు వార్తలు వస్తుంటే ఆమె మాత్రం నేను అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నానని చెబుతోంది.

Actress Sai Pallavi Fantastic Answer About Makeup :

Sai Pallavi reveals why she prefers to act without makeup
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs