Advertisement
Google Ads BL

తెలుగమ్మాయి వార్తల్లో నిలుస్తోంది!


ప్రస్తుతం ఇతర భాషల భామలే కాదు.. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారడంతో తెలుగమ్మాయిలకు కూడా టాలీవుడ్‌లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇక వీరిలో ప్రస్తుతం యూత్‌ని ఆకర్షిస్తోన్న భామ ఈషా రెబ్బా. ఎక్కువగా గ్లామర్‌షోని నమ్ముకోకుండా పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ఈమె నటించిన 'అంతకు ముందు ఆ తర్వాత, అమీతుమీ, అ' చిత్రాలలో ఈ భామ బాగా మెప్పించింది. ముఖ్యంగా 'అ'లో సింపుల్‌గా కనిపిస్తూ, నటిస్తూ పాత్రకు జీవం పోసింది. ఇక ఈమెకి ప్రస్తుతం తేజ-వెంకటేష్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో నారా రోహిత్‌కి జోడీగా మంచి కీలకమైన పాత్ర లభించిందని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇక తెలుగులో ఇప్పుడున్న మల్టీ టాలెంటెడ్‌ పర్సన్స్‌లో శ్రీనివాస్‌ అవసరాల ముందు వరుసలో ఉంటాడు అమెరికాలో చదువుకుని, సినీ విభాగాలలో శిక్షణ తీసుకుని వచ్చిన ఈయన నటునిగా, దర్శకునిగా కూడా రాణిస్తున్నాడు. త్వరలో ఆయన నాని హీరోగా కూడా ఓ చిత్రం డైరెక్ట్‌ చేయనున్నాడు. ఇక ఈషా రెబ్బా నటించిన చిత్రాలలో శ్రీనివాస్‌ అవసరాల వెండితెరపై కనిపించడమే కాదు... నిజ జీవితంలో కూడా ఎక్కడ చూసినా ఈయన ఈషారెబ్బాతో కలిసి కనిపిస్తున్నాడని, వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. శ్రీనివాస్‌ అవసరాలలో మరో మంచి గుణం ఉంది. ఈయన మల్టీ టాలెంటే కాదు.. మద్యం, సిగరెట్లు, అమ్మాయిలకు ఈయన దూరంగా ఉంటాడు. 

ఈ మధ్య శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ, తాను ఇంకా ఆర్ధికంగా స్ధిరపడలేదని, స్ధిరపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపాడు. మరోవైపు ఈషా రెబ్బా తాను నటించిన 'మాయామాల్‌' చిత్రంలో తనతో నటించిన సహనటుడు దిలీప్‌తో ఎఫైర్‌ నడుపుతోందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి వీటిల్లో ఎంత నిజం ఉందో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నోరు విప్పితే తప్ప నిజం బయటకు రాదు.

Eesha Rebba In Love With Avasarala Srinivas:

Avasarala Srinivas Love Affair With Tollywood Heroine 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs