Advertisement
Google Ads BL

రిలీజ్ కు ముందే 'సైరా' రికార్డు అదిరింది!


మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'  రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మార్చికి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ నయనతార ఈ షెడ్యూల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాపై వచ్చిన ఒక న్యూస్ తో చిరంజీవి ఫ్యాన్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కనివిని ఎరుగని స్థాయిలో అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

ఈ వార్త గతంలోనే వచ్చిన ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినట్టు టాక్. మెగాస్టార్ సినిమాకు ఇంత రేట్ రావడం మాములు విషయం కాదు. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ హావా నడుస్తుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. తమిళ - కన్నడ - హిందీ సినిమాలని కూడా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంటోంది. విడుదలైన 28 రోజులకే తమ యాప్ లో స్ట్రీమింగ్ పెట్టేలా ఒప్పందం చేసుకుంటున్న ఈ సంస్థ. విన్నర్ నుంచి లేటెస్ట్ హిట్ భాగమతి దాకా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది.

త్వరలో విడుదల కానున్న 'రంగస్థలం, భరత్ అనే నేను' సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఖాతాలో ఉన్నాయి. ఇవి కూడా 28 రోజులకే చేసేలా ఒప్పందం జరిగిందా లేక గడువు పొడిగించారా అనేది తెలియాల్సి ఉంది. ఇక 'సైరా' సినిమా శాటిలైట్ రైట్స్ 30 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా కూడా ఉంది. ఇంకా సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోకుండా సగానికి పైగా బడ్జెట్ ఇలా హక్కుల రూపంలోనే రాబడుతున్న సైరా ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు వేదికగా మారనుందో చూడాలి.

Mega Star's 'SYe Raa' Sensation before its Release:

Sye Raa Narasimha Reddy Digital Rights for Record price
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs