Advertisement
Google Ads BL

సామ్-చైతూలు కలిసి సినిమా చేస్తున్నట్టేనా?


నాగ చైతన్య - సమంతల కాంబినేషన్ లో సినిమా అనగానే కేవలం అక్కినేని అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ ఆ కాంబో మీద ఎనలేని ఆసక్తి క్రియేట్ అయ్యింది. అంతగా ఆ కాంబో మీద క్యూరియాసిటీ అండ్ అంచనాలు రావడానికి గల కారణం నాగ చైతన్యని సమంత పెళ్లాడడమే. ఇంతకుముందు వీరిద్దరూ 'ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య' సినిమాల్లో నటించారు. కానీ అప్పుడు ఈ జంట మీద ఇంత అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ప్రేమికులుగా మారి ఆఫ్ స్క్రీన్ మీద జంట పక్షుల్లా విహరించి.... అందంగా పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ క్యూటేస్ట్ కపుల్ మళ్ళీ ఆన్ స్క్రీన్ అనగానే ఇంతగా అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement
CJ Advs

డీవీవీ దానయ్య, కోన వెంకట్ నిర్మాతగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య - సమంతల జంట ఒక ప్రేమ కథ చిత్రంలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. మరి దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకు నాగ చైతన్య కనెక్ట్ అవడమే కాదు.. హీరోయిన్ పాత్రకి సమంతని ఒప్పించాడనే టాక్ కూడా ఉంది. మరి ఈ సినిమా ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండగా ఇప్పుడు చైతు, సామ్ ల ప్రేమ కథకు 'ప్రేయసి' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. కేవలం పరిశీలనలోనే కాదు... ఫైనల్ గా ఈ 'ప్రేయసి' టైటిల్ ని ఖరారు చేస్తారని కూడా అంటున్నారు.

మరి ప్రస్తుతం ఈ జంట తమ తమ సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా వుంది. నాగ చైతన్య 'సవ్యసాచి', మారుతీ డైరెక్షన్ లో 'శైలజ రెడ్డి అల్లుడు' అనే సినిమాలతో  బిజీగా ఉండగా, సమంత అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా వుంది. మరి వీరిద్దరూ తమ తమ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ కాగానే శివ డైరెక్షన్ లో ప్రేయసి సినిమా కోసం రెడీ అవుతారనే సమాచారం వుంది.

Naga Chaitanya Next Movie to be Titled Preyasi :

Samantha Akkineni to become Naga Chaitanya's Preyasi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs