Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది!


జై లవ కుశ తో హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా ఆఫీషియల్ గా ఎప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ... ఆ సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకోలేదు. ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేలోపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కోసం మేకోవర్ అయ్యే పనిలో తలమునకలైపోయాడు. జై లవ కుశ టైం లో కాస్త ఒళ్ళు చేసినట్టుగా కనబడిన ఎన్టీఆర్... బరువు తగ్గించుకోవడంతో పాటు తన లుక్ లోను కాస్త చేంజెస్ తీసుకురావడానికి గాను విదేశాలకు వెళ్లినట్టుగా వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ మరోమారు బరువు తగ్గే క్రమంలో లైపో సెక్షన్ చేయించుకున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ బరువును తగ్గించుకోవడానికి లైపోని ఆశ్రయించలేదని... మాములుగా అంటే నేచురల్ పద్దతిలోనే ఎన్టీఆర్ బరువు తగ్గించుకుంటున్నాడని ఎన్టీఆర్ సన్నిహితులు అన్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడనేది నిజమే అని తేలిపోయే ప్రూఫ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఎన్టీఆర్ చాలా సన్నగా స్టైలిష్ గా, సింపుల్ గా ఉన్న ఫోటో ఒకటి లీకైంది. ఆ పిక్ లో ఎన్టీఆర్ స్మైల్ తో చాలా సన్నగా డీసెంట్ గా కనబడుతున్నాడు. మరి త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చడంతోపాటే... బరువు కూడా తగ్గిపోయాడు.

ఇక ఎన్టీఆర్ మరో సంతోషకర విషయానికి కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ మరోమారు తండ్రి కాబోతున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎన్టీఆర్ వచ్చే మే లో మరోసారి తండ్రి అయ్యే ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తున్నాడు. అలాగే తనకిష్టమైన త్రివిక్రమ్ డైరెక్షన్ లోను, రాజమౌళి డైరెక్షన్ లోను ఎన్టీఆర్ సినిమాలు చెయ్యబోతున్నాడు.

NTR’s Look For Trivikram Srinivas Film:

NTR’s New Look Resembles That Of Rabhasa  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs