Advertisement
Google Ads BL

దుమ్ము రేపుతున్న..'రంగా రంగా రంగస్థలాన'!


ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన రంగస్థలం లోని ఎంత సక్కగున్నావే అనే పాట మార్కెట్ లో హల్చల్ చేస్తుంది. ఇంకా దాని హడావిడి ముగియక ముందే మళ్ళీ రంగ రంగ రంగస్థలానా... అంటూ మరో పాటని వదిలి మళ్ళీ హడావిడి మొదలెట్టేశాడు. మరి రంగస్థలం హీరో రామ్ చరణ్ కోరుకున్నట్టుగానే డైరెక్టర్ సుకుమార్ రంగస్థలంలోని రామ్ చరణ్ వీడియో బిట్ తో పాటే... ఈ లిరికల్ వీడియో ని విడుదల చేశారు. మరి ఈ సినిమాలో సౌండ్ ఇంజినీర్ గా నటిస్తున్న చిట్టి బాబు... రామ్ చరణ్ తనదయిన స్టయిల్లో వినబడేట్లు కాదురా.. కనబడేట్లు కొట్టండేహే అంటూ డాన్స్ చేస్తూ చెప్పే డైలాగ్ తో రంగ రంగ రంగస్థలానా అంటూ డాన్స్ తో  అదరగొట్టేశాడు. 

Advertisement
CJ Advs

మరి రంగస్థలంలో రామ్ చరణ్ పంచె కట్టిన విజువల్స్ తో బయటికి వచ్చిన ఈ పాట ఇప్పుడు అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫేర్ గా చరణ్ వేసిన స్టెప్స్ ఈ పాటకే హైలెట్టా అన్నట్టుగా  వుంది చరణ్ చిన్న బిట్ డాన్స్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇచ్చిన నాటు ఊరమాస్ డప్పుల కొట్టుడు ఈ పాటకు మరో హైలెట్ అన్నట్టుగా వున్నాయి. ఇక ఈ సాంగ్ ని ఆలపించింది మాత్రం రాహుల సింప్లిగంజ్. అతను ఈ రంగ రంగ రంగస్థలాన పాటను అలా అలా అలవోకగా పడేసాడు. మరి ఈ పాట మొత్తం ఒక జాతరలో జరిగినట్లుగా ఆపాట విజువల్స్ లో తెలుస్తుంది.

మరి రామ్ చరణ్ మరియు అతడి వెనుక ఉన్న డాన్సర్స్ కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసినట్లుగా ఆ సాంగ్ లోని వీడియో బిట్ లో చరణ్ డాన్స్ తెలియజేస్తుంది. ఈ పాట వీడియో ప్లే లో దర్శకుడు సుకుమార్, ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఈ పాట రాసిన చంద్ర బోస్ వంటి వారు కనబడ్డారు గాని ఈ సినిమాలో మరో అద్భుతం రామలక్ష్మి అదేనండి సమంతని కనబడకుండా కవర్ చేశారు. మరి ప్రస్తుతం చరణ్ ఉన్న ఈ పాట ఎంత సక్కగున్నావే పాట కన్నా హైలెట్ గా ఉందనే కామెంట్స్ పడుతుండగా... రామ్ చరణ్, సమంత ల పాట ఏదైనా విడుదలతే ఇక మెగా ఫాన్స్ ని పట్టుకోవడం ఎవరివల్ల కాదేమో.

Click Here for Song

Rangasthalam Title Song Report:

<span>Rangasthalam Title Song Released</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs