Advertisement
Google Ads BL

గౌతమి ఎఫెక్ట్‌ కమల్‌పై పడనుందా!


కమల్‌తో 13 ఏళ్ల సహజీవనం అనంతరం గౌతమి, కమల్‌హాసన్‌లు 2016లో విడిపోయారు. దీనికి శృతిహాసనే కారణమని వార్తలు వచ్చాయి. దానిని గౌతమి ఖండించింది. మేమిద్దరం  విడిపోవడానికి శృతి, అక్షర కారణం కాదు. వారిని ఇప్పటికీ నా పిల్లల లాగనే భావిస్తున్నాను. కొన్ని కొన్ని కొత్త కమిట్స్‌ని కమల్‌ తీసుకున్నారు. అవి నా ఆలోచనలకు సరిపడలేదు. పైగా నా ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనిపించింది. ఇక నేను సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఆయనకు నేను సపోర్ట్‌ చేయడం లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా నా కూతురు సుబ్బులక్ష్మి మాత్రమే. ఆమె భవిష్యత్తు, ఆర్ధిక వనరుల పైనే దృష్టి పెట్టాను. 

Advertisement
CJ Advs

ఇక కమల్‌హాసన్‌ సొంత చిత్రాలకు, ఆయన బయట నటించిన చిత్రాలకు నేను కాస్ట్యూమ్స్‌ విషయంలో పని చేశాను. కానీ ఆయన నాకు పారితోషికం ఇప్పటివరకు ఇవ్వలేదు. దశావతారం, విశ్వరూపం చిత్రాల అమోంట్‌ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇక నేను క్యాన్సర్‌ని ఎదిరించి నిలిచాను. ఇప్పుడు నా దృష్టి క్యాన్సర్‌ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 'లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌, సుబ్బు జీవితం' మీదనే అని చెప్పింది కానీ కమల్‌ని రాజకీయంగా దెబ్బతీయడానికే గౌతమి ఇప్పుడు ఇలా మాట్లాడుతోందని, ఆమె బిజెపి చేతిలో కీలుబొమ్మగా మారిందని కమల్‌ అభమానులు మండిపడుతున్నారు.

Gouthami About Split with Kamal Haasan:

Gautami Tadimalla Reveals The Real Reason Why 13 Years Of Relationship With Kamal Hasaan Ended
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs