Advertisement
Google Ads BL

రంగస్థలం ఆలస్యానికి కారణం ఈ నటుడేనా?


ప్రకాష్ రాజ్ ఓ గొప్ప నటుడు. ఇది ఎవ్వరైనా చెప్పేమాటే. ఎందుకంటే అతను తండ్రి పాత్ర చేసినా, విలన్ పాత్ర చేసినా, హీరో పాత్ర.. ఏదైనా సరే చాలా ఈజీగా చేస్తుంటాడు. ప్రకాష్ రాజ్ చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్.. బాలీవుడ్ లో సినిమాలు మీద సినిమాలు చేసి ఫుల్ బిజీ అయిపోయాడు. కానీ కొన్ని రోజులు నుండి ప‌రిస్థితి అలా లేదు. చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇలా ప్రకాష్ రాజ్ సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డ‌మేంటీ? దానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌నే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

Advertisement
CJ Advs

సినిమా షూటింగ్స్ కి లేట్ గా వస్తాడంట. సడన్ గా షూటింగ్ కి రాకుండా మానేస్తాడంట. అందుకే దర్శకులు అతనికి సినిమా ఛాన్సులు ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఇలా చాలా వార్తలు ప్రకాష్ రాజ్ పై వస్తుంటాయి. అవి నిజమే. తాజాగా రంగస్థలం సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణం ప్రకాష్ రాజే అంటూ గుస‌గుస‌లాడుతున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు. ప్రకాష్ రాజ్ మీద ఆది పినిశెట్టి మీద చిత్రీక‌రించాల్సిన సీన్లు ఉన్నాయ‌ని... అవి తీయటానికి డైరెక్టర్ సుకుమార్ ఆది పినిశెట్టి వైజాగ్ లో షూటింగ్ లో ఉంటే బ‌తిమిలాడి హైద‌రాబాద్ ర‌ప్పించాడ‌ట‌. కానీ ప్రకాష్ రాజ్ ఆ రోజు షూటింగ్ కి చెప్పాపెట్ట‌కుండా డుమ్మాకొట్టాడ‌ట‌. ఆది తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడు. దీంతో ఆ సీన్లు పెండింగ్ పడినట్టు సమాచారం.

ప్రకాష్ రాజ్ సీనియర్ నటుడే కానీ ఇలా చేస్తాడంటే న‌మ్మ‌డానికి కాస్త క‌ష్ట‌మే. ఆయన ప్ర‌వ‌ర్త‌న‌తో త్రివిక్రమ్.. దిల్ రాజు విసిగెత్తిపోయి వున్నారు. అందుకే ప్రకాష్ రాజ్ ప్లేస్ వేరే వాళ్ళతో రీప్లేస్ చేసుకుంటున్నారు వీరు. మరి ప్ర‌కాష్ రాజ్ చెవిలో ఈ విష‌యాలు ప‌డ్డాయో లేదో మ‌రి.

Prakash Raj is Reason for Rangasthalam Shooting Delay:

Rangasthalam Team Unhappy with Prakash Raj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs