ఒకప్పుడు రైటర్ ఇప్పుడు డైరెక్టర్. తెలుగు పరిశ్రమకు నూతన దర్శకుడిగా పరిచయమవుతున్న రైటర్ వక్కంతం వంశి తన మొదటి సినిమానే స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ ని పట్టేసాడు. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా మొదలెట్టినప్పటి నుండి ఈ సినిమాపై అల్లు అర్జున్ గురించి వచ్చిన క్రేజ్ తప్ప... ఈ సినిమాపై ఓ.. అన్నంత హైప్ అయితే లేదు. కానీ ఈ మధ్యన నా పేరు సూర్య ఫొటోస్ వదులుతున్న తీరుతో పాటే.. ఆపిక్స్ లో ఉన్న అల్లు అర్జున్ లుక్ తో మాత్రం సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
మొన్నటికి మొన్న లవర్స్ డే రోజున అను ఇమ్మాన్యుయేల్ తో కలిసి అల్లు అర్జున్ రొమాంటిక్ పోస్టర్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా నా పేరు సూర్య పోస్టర్ ఇంఫెక్ట్ అంటూ ఒక పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో బన్నీ లుక్ ఉంది చూసారు. అబ్బబా బన్నీ హెయిర్ స్టయిల్, అతని బాడీ లాంగ్వేజ్ తోపాటు ఆ స్టయిలిష్ లుక్, అలాగే నోటిలో ఉన్న చుట్ట అదేనండి సిగార్ పెట్టుకుని ఒక చూపు చూస్తూ జీప్ డ్రైవ్ చేస్తూ ఇచ్చిన ఫోజ్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే నమ్మాలి మరి.
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనబడబోతున్నాడు. వక్కంతం వంశి మొదటి సినిమా నా పేరు సూర్య అంటే ఎవరు నమ్మేలా లేరు. అంత బావుంది వక్కంతమ్ చూపించే వర్కింగ్ స్టయిల్. మరి ఆర్మీ అంటే ఆ ఫిట్నెస్, ఆ హుందాతనం అన్ని అల్లు అర్జున్ లుక్ లో కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. మరి అంత మాస్ ఊర మాస్ రఫ్ లుక్ లో అల్లు అర్జున్ ని చూసేసరికి మెగా ఫ్యాన్స్ వారెవా ఏమి స్టిల్ గురూ.. అదిరిపోలా అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి అల్లు అర్జున్ నా పేరు సూర్య లుక్ లోకి అప్పుడే చాలామంది మారిపోతున్నారంటే రెండో సారి నమ్మాలి మరి.