Advertisement
Google Ads BL

ఖుష్బూపై కోడి గుడ్లతో దాడి..!


ఈ మద్య మీడియా వ్యవహారశైలి శృతిమించుతోందని, హాట్‌కామెంట్స్‌పై చర్చలు నిర్వహిస్తూ, రెచ్చగొడుతున్నారని కొందరు సెలబ్రిటీలు అంటున్నారు. మరికొందరు సెలబ్రిటీలు కావాలనే వార్తల్లో నానేందుకు బూతుగా కనిపించే తమ ఫొటోలను, వ్యాఖ్యలను చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో హాట్‌కామెంట్స్‌ చేసే వారిలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటున్నారు. దానిపై మీడియా, నెటిజన్లు తమ అభిప్రాయాలను, ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మగాడు ఆడదాని గురించి మాట్లాడితే ఉద్యమాలు, నిరసనలు, పోలీస్‌ కేసులు వేసే మహిళలు ఇలాంటి తమ తోటి ఆడవారైనా సెలబ్రిటీలు ఏది కామెంట్‌ చేసినా అది వారి స్వేచ్చ అని తీర్మానిచ్చేస్తున్నారు. మగాళ్లు మాట్లాడితే అది నేరం.. ఆడది మాట్లాడితే అది స్వేచ్చగా ఎలా మారుతుందో అర్ధం కాని పరిస్థితి. 

Advertisement
CJ Advs

ఇక ఈ మద్యనే శృతిహాసన్‌ పిల్లల కోసమే అయితే పెళ్లి చేసుకోవాల్సిన పనిలేదని చెప్పింది. అదే మాట ఏ మగాడైన ఆడవాళ్లు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే... దానికి పెళ్లి అవసరం లేదని వ్యాఖ్యానిస్తే పరిస్థితులు ఎలా ఉండేవి? అది ఆయా సెలబ్రిటీల స్వేచ్చ అనే అనుకుందాం.. కానీ సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక 2005లో నటి ఖుష్బూ ఆడవారు పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడం తప్పులేదని, కాకపోతే గర్బవతులు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవేవో వ్యాఖ్యలు చేసింది. దీంతో తమిళనాడులోని పెరంబుదూర్‌ వద్ద ఉన్న మేటూర్‌ కోర్టులో పౌటాలి మక్కల్‌ఖచ్చి తరపు న్యాయవాది మురుగన్‌ మేటూర్‌ కోర్టులో ఖుష్బూపై పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసు విషయమై ఖుష్బూ కోర్టుకి హాజరవుతుండగా, కొందరు ఆమె కారుపై కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. దీంతో మేటూర్‌ తహశీల్దార్‌ ఫిరోజ్‌ ఖాన్‌ పాట్టల్‌ మక్కల్‌ఖచ్చికార్యకర్తలైన 41 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ప్రభుత్వ తరపు న్యాయవాది జగన్నాథన్‌ తన వాదనను కోర్టుకి వినిపించాడు. మేజిస్ట్రేట్‌ ఖుష్బూ నుంచి కొన్నివివరణలు తీసుకుని కేసును 6వ తేదీకి వాయిదా వేశాడు. ఇక నాడు ఖుష్బూకి తమిళనాడులో గుడులు కట్టారు. కానీ ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆమె గుళ్లు కొన్నింటిని ఆమె అభిమానులే పగుల గొట్టారు. ఒకే విషయంలో ఆడవారు మాట్లాడితే ఒకలా. మగాళ్లు కామెంట్‌ చేస్తే ఒకవిధంగా స్పందించడం ఎవ్వరికీ మంచిది కాదు.

Kushboo Car Attack at Court:

Actress Kushboo car attacked with eggs and tomatoes  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs