Advertisement
Google Ads BL

కస్తూరి ఓవర్‌ యాక్షన్‌ చూశారా.!


నటి కస్తూరి.. దక్షిణాదిన పేరున్న నటి. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇక ఈమె సినిమా అవకాశాలు తగ్గడంతో వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుంటోంది. ఆ మధ్య కాస్టింగ్‌ కౌచ్‌ గురించి, సీనియర్‌ హీరోలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక రాజకీయాలలోకి రాకముందు రజనీ సరైన నిర్ణయం తీసుకోలేని అసమర్ధుడని, రాజకీయాలలో వేగంగా, సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని తానేదో పెద్ద రాజకీయ నాయకురాలిలా మాట్లాడింది. ఇక తాజాగా రాజకీయాలలోకి వచ్చిన కమల్‌పై కూడా అవాకులు చెవాకులు పేలింది. కానీ ఈమె ప్రస్తుతం తనలోని మరీ నీచమైన బుద్దిని చూపింది.గత నాలుగు రోజులుగా టివి చానెల్స్‌ శ్రీదేవి మరణవార్త మీదనే వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి నటించిన సీన్స్‌, పాటల విజువల్స్‌ని చానెల్స్‌ టెలికాస్ట్‌ చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఒకవైపు సినీ ప్రేమికులు, సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, పలు భాషల నటీనటులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కూడా శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంటే కస్తూరి మాత్రం 'శ్రీదేవి మరణించింది కాబట్టి ఆమె పాటలు, సీన్స్‌ వేస్తున్నారు. రేపు సన్నిలియోన్‌ మరణిస్తే అప్పుడు ఏమి ప్రదర్శిస్తారు'.. అంటూ వ్యంగ్యంగా స్పందించింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి నటి, తనకన్నా సీనియర్‌ మరణిస్తే ఆమె ఇలా జోక్‌లు వేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. కానీ ఆమె తన ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ జోక్‌ని పోస్ట్‌ చేశానని వాదిస్తోంది. మొత్తానికి ఈమె తన పైత్యం చూపించిందనే చెప్పాలి. ఇక ఈమె మరణిస్తే పెద్దగా అసలు పాటలను, సన్నివేశాలను కూడా చూపరేమో అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Kasturi trolled for comparing Sridevi to Sunny Leone:

Kasturi's satirical comparison on 'Sridevi-Sunny Leone' death angers netizens
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs