Advertisement
Google Ads BL

నిజమేనా.. ఆ 'ఇద్దరు' కాంబోలో సినిమా?


రెండు దశాబ్దాల క్రితం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, గ్రేట్ యాక్టర్ మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ కలయికలో వచ్చిన 'ఇద్దరు' సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యంగా ఇప్పటికి కొనియాడబడుతుంది. ఇద్దరు స్నేహితులు, రాజకీయాల్లో పావులుగా ఎలా మారారు, అలాగే ఒక సినీ యాక్టర్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని మణిరత్నం ఎంతబాగా చూపించాడొ మాటల్లో వర్ణించలేనిది. తమిళనాట రాజకీయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఆ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్. అయితే ఆ సినిమా తర్వాత మోహన్ లాల్ తన సినిమాలతోను,  దర్శకుడు మణిరత్నం తాను డైరెక్ట్ చేసిన సినిమాలతోను బిజీ అయిపోయి... మళ్ళీ వారి కాంబోలో ఏ ఒక్క సినిమా తెరకెక్కలేదు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు 20  ఏళ్ళ కాలంలో మళ్ళీ కలవని వీరు ఇప్పుడు ఒక సినిమా చేయబోతున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. వచ్చే ఏడాది మణిరత్నం, మోహన్ లాల్ కాంబోలో ఒక సినిమా పట్టాలెక్కబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం ‘చెక్క చివంత మానం’ అనే సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్స్ శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ఫాహద్ ఫాజిల్, జ్యోతిక, అదితిరావు హైదరి లాంటి భారీ తారాగణంతో మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ భారీ మల్టీస్టారర్ ఈ ఏడాది చివర్లో గాని ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. 

అలాగే మోహన్ లాల్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఒడియన్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఆ సినిమా కోసం మోహన్ లాల్ బాగా బరువు తగ్గి యూత్ లుక్ లా సరికొత్త లుక్‌లోకి మారాడు. మరి ఆ సినిమా పూర్తి కాగానే మోహన్ లాల్  మరో భారీ బడ్జెట్ మూవీ చెయ్యాల్సి ఉంది.  అది కూడా మహాభారతం నేపథ్యంలో 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోయే మెగా ప్రాజెక్టులో నటించాల్సి ఉంది. కానీ ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆలస్యమయ్యేలా ఉంది. అందుకే మహాభారతం కంటే ముందే మణి రత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ నటించే ఆవకాశముంది. మరి మణి - మోహన్ లాల్ కాంబో అనగానే ఆ సినిమాపై పిచ్చ అంచనాలు వచ్చేస్తున్నాయి అప్పుడే.

Is A Mohanlal-Mani Ratnam Movie On Cards?:

Mohanlal to team up with Mani Ratnam for his next film?    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs